బ‌స్సులో మంట‌లు.. కండ‌క్ట‌ర్ స‌జీవ ద‌హ‌నం

బ‌స్సుకు మంట‌లు అంటుకోవ‌డంతో అందులో నిద్ర‌పోతున్న కండ‌క్ట‌ర్ స‌జీవ ద‌హ‌నం అయ్యాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 March 2023 2:33 PM IST
Bus Catches Fire, Bengaluru

కండ‌క్ట‌ర్ ముత్తయ్య స్వామి

బస్టాండ్‌లో పార్కు చేసి ఉన్న బస్సులో మంట‌లు చెల‌రేగాయి. ఈఘ‌ట‌న‌లో కండ‌క్ట‌ర్ స‌జీవ ద‌హ‌నం అయ్యాడు.

వివ‌రాల్లోకి వెళితే.. సుమనహళ్లి బస్ డిపోకు చెందిన బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బ‌స్సును బ‌స్టాండ్‌లో గురువారం రాత్రి పార్క్ చేశారు. డ్రైవ‌ర్ ప్ర‌కాశ్‌ బ‌స్టాండ్‌లోని రెస్ట్‌రూంలో నిద్ర‌పోవ‌డానికి వెళ్లాడు. కండ‌క్ట‌ర్ ముత్తయ్య స్వామి మాత్రం అదే బ‌స్సులో ప‌డుకున్నాడు.

కాగా.. అక‌స్మాత్తుగా బ‌స్సులో మంట‌లు చెల‌రేగాయి. మంట్లో చిక్కుకున్న ముత్తు స్వామి 80 శాతం కాలిన గాయాల‌తో అక్క‌డిక్క‌డే మృతి చెందారు. రాత్రి 12 గంట‌ల స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంద‌ని బీఎంసీ తెలిపింది. అయితే.. బ‌స్సుకు మంట‌లు ఎలా అంటుకున్నాయి అన్న సంగ‌తి తెలియ‌రాలేదు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story