సైబర్ క్రిమినల్ కు ఉద్యోగం ఇచ్చారు.. అతడేమి చేశాడంటే.?

ఉద్యోగం ఇచ్చే సమయంలో సదరు కంపెనీ ఎవరికి ఇస్తున్నాం అని తెలుసుకోడానికి బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేస్తుంది.

By M.S.R  Published on  19 Oct 2024 3:04 AM GMT
సైబర్ క్రిమినల్ కు ఉద్యోగం ఇచ్చారు.. అతడేమి చేశాడంటే.?

ఉద్యోగం ఇచ్చే సమయంలో సదరు కంపెనీ ఎవరికి ఇస్తున్నాం అని తెలుసుకోడానికి బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేస్తుంది. కానీ ఓ ఐటీ కంపెనీ ఓ సైబర్ క్రిమినల్ కు పొరపాటున ఉద్యోగం ఇచ్చేసింది. ఇక అంతే!! డేటా మొత్తం దొబ్బేశాడు ఆ కేటుగాడు.

ఒక ఉత్తర కొరియాకు చెందిన IT ఉద్యోగి నియామకానికి సంబంధించి ఈ ఘటన చోటు చేసుకుంది. UK, US, ఆస్ట్రేలియాలో ఉన్న ఓ సంస్థ, ఉత్తర కొరియా సైబర్ నేరస్థుడిని ఉద్యోగిగా నియమించుకుంది. అతడు జాబ్ కు అప్లై చేసే ముందు అన్నీ ఫేక్ పెట్టాడు. నిజమైన ఉద్యోగి అని భావించిన సదరు కంపెనీ కాంట్రాక్ట్ వర్కర్ గా నియమించింది. అతడు కేవలం నాలుగు నెలలు సంస్థలో పనిచేశాడు. అతను కంపెనీ కంప్యూటర్ నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేసిన తర్వాత, కీలకమైన కంపెనీ డేటాను డౌన్‌లోడ్ చేసి డబ్బులు ఇస్తారా.. లేక డీటైల్స్ ను బయట అమ్మేయనా అంటూ కంపెనీని బెదిరించడం మొదలుపెట్టారు.

ఆ వ్యక్తి కార్పొరేట్ నెట్‌వర్క్‌లోకి లాగిన్ అవ్వడానికి సంస్థకు చెందిన రిమోట్ వర్కింగ్ టూల్స్‌ను ఉపయోగించాడని BBC నివేదించింది. వీలైనంత ఎక్కువ కంపెనీ డేటాను రహస్యంగా డౌన్‌లోడ్ చేశాడు. అతడి పేలవమైన పనితీరు కారణంగా కంపెనీ అతనిని ఉద్యోగంలో నుండి తొలగించింది. అప్పుడు క్రిప్టోకరెన్సీలో ఆరు అంకెల మొత్తాన్ని చెల్లించాలనే డిమాండ్‌తో కూడిన ఇమెయిల్‌లను కంపెనీ అందుకుంది. అడిగిన డబ్బును కంపెనీ చెల్లించకపోతే, దొంగిలించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయడం లేదా అమ్మడం చేస్తానని హ్యాకర్ బెదించాడు. ఆ డబ్బును చెల్లించారా లేదా అనేది ఆ సంస్థ వెల్లడించలేదు.


Next Story