విద్యార్థిని ఆత్మహత్య కలకలం.. ప్రొఫెసర్లు ఆ పని చేయమనడంతో..

College Student In Tamil Nadu Commited Suicide. తమిళనాడులోని టెన్సాకిలో శనివారం ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. క్షమాపణ లేఖను

By అంజి  Published on  14 March 2022 1:30 PM IST
విద్యార్థిని ఆత్మహత్య కలకలం.. ప్రొఫెసర్లు ఆ పని చేయమనడంతో..

తమిళనాడులోని టెన్సాకిలో శనివారం ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. క్షమాపణ లేఖను రాయాలని ప్రొఫెసర్లు ఆమెను ఆదేశించడంతో మనస్తాపం చెందిన బాధిత విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని శనివారం కళాశాలకు బయలుదేరడానికి సిద్ధంగా ఉందో లేదో చూడటానికి తల్లి వెళ్లినప్పుడు, ఆమె తన గదిలో విద్యార్థిని ఉరి వేసుకుని కనిపించింది. తరగతిలోకి సెల్‌ఫోన్ తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నట్లు యువతి తన సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ఇద్దరు ప్రొఫెసర్లు తనను శిక్షించారని, తాను చేయని పనికి క్షమాపణ లేఖ రాయమని ఆదేశించారని ఆమె చెప్పింది.

అంతేకాకుండా ఇతర విద్యార్థుల ముందు ప్రొఫెసర్ తనను మందలించాడని 18 ఏళ్ల అమ్మాయి చెప్పింది. తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థి బంధువులు ఆందోళనకు దిగారు. అయితే పోలీసులు విచారణ ప్రారంభించి ఇద్దరు ప్రొఫెసర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు తదుపరి దర్యాప్తును కొనసాగిస్తోంది. కాగా ఇలాంటి కారణాలతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. పరీక్షల కోసం విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. అదే విధంగా కొన్ని రోజుల క్రితం అహ్మదాబాద్‌లో ఒక మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

Next Story