ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేపై సీఐడీ కేసు
CID books cases against ABN Andhra Jyothi MD.ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణపై సీఐడీ అధికారులు
By తోట వంశీ కుమార్ Published on 13 Dec 2021 2:30 AM GMT
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లో శుక్రవారం(డిసెంబర్ 10న) తనిఖీలు నిర్వహిస్తున్న ఏపీ సీఐడీ అధికారులను వేమూరి రాధాకృష్ణ అడ్డుకోవడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై సీఐడీ విభాగం రాజహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న జీవీవీ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై మంగళగిరిలోని సీఐడీ ప్రధాన పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఐపీసీ 353, 341, 186, 120(బీ) సెక్షన్ల కింద రాధాకృష్ణపై కేసు నమోదుచేసినట్టు సీఐడీ అధికారులు తెలిపారు.
కేసు తదుపరి విచారణ కోసం తెలంగాణకు సీఐడీ బదిలీ చేయనున్నది. అవినీతికి పాల్పడ్డ వారి ఇళ్లలో అధికారులు దర్యాప్తు చేస్తుండగా రాధాకృష్ణ అడ్డుకోవడానికి య త్నించడంతో తీవ్ర ఒత్తిడి మధ్యనే సీఐడీ అధికారులు పంచనామా పూర్తిచేసినట్లు సీఐడీ పేర్కొన్నది. ఈ జీరో ఎఫ్ఐఆర్‌ను గుంటూరులోని ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో సమర్పించామని తదుపరి విచారణ కోసం జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ హౌస్ అధికారికి ఈ కేసును బదలాయించేందుకు వీలుగా తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని ఎఫ్ఐఆర్‌లో వివరించారు.