దారుణం.. ఏడు నెలల పసికందును ఎత్తుకెళ్లి
Child sexual attack at Bodandapalem.ఏడు నెలల చిన్నారిని కన్నతల్లి రాత్రి ఊయలలో వేసి నిద్రపుచ్చింది.
By తోట వంశీ కుమార్ Published on 21 July 2021 12:22 PM ISTఏడు నెలల చిన్నారిని కన్నతల్లి రాత్రి ఊయలలో వేసి నిద్రపుచ్చింది. ఉదయాన్నే చూస్తే పాప కనిపించలేదు. ఆందోళన చెందిన తల్లి పాప కోసం చుట్టుపక్కల అంతా వెతికింది. ఇంటికి కొద్దీ దూరంలోని నిర్మానుష్య ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడిఉన్న పాపను స్థానికులు చూశారు. విషయం తెలుసుకున్న ఆ తల్లి బోరున విలపిస్తూ వెళ్లింది. చిన్నారి పెదాలు, మర్మాంగాలపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో పసిపాప పై అఘాయిత్యానికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలంలో చోటుచేసుకుంది.
కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మాచర్ల మండలం బోదనంపాడులో ఓ కుటుంబం నివసిస్తోంది. సోమవారం రాత్రి ఇంటి ఆవరణలో 7నెలల పసికందును ఊయలలో నిద్రపుచ్చి పక్కనే తల్లి నిద్రపోయింది. తెల్లవారే సరికి లేచి చూస్తే పాప కనిపించలేదు. కుటుంబ సభ్యులతో కలిసి గాలించింది. ఓ ప్రాంతంలో పాప ఉందని తెలుసుకుని అక్కడకు వెళ్లారు. ఆ పాప తమ చిన్నారినేనని గుర్తించారు. పాప అపస్మారక స్థితిలో ఉంది. ఒంటిపై గాయాలు చూసి తల్లి గుండె తల్లడిల్లిపోయింది. కుటుంబసభ్యులు హుటాహుటిన మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా. పాప పెదాలు, మర్మావయాలపై గాయాలున్నట్లు వైద్యులు గుర్తించారు.
అక్కడ ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన వైద్య సదుపాయం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. వైద్యుల నివేదిక వచ్చిన తరువాతనే పాపపై అఘాయిత్యం జరిగిందా లేదా అన్నది తేలుతుందని పోలీసులు తెలిపారు.