దారుణం.. ఫోన్ వాడొద్దని చెప్పినందుకు అన్నను చంపిన చెల్లి
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 5 May 2024 5:17 AM GMTదారుణం.. ఫోన్ వాడొద్దని చెప్పినందుకు అన్నను చంపిన చెల్లి
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ వాడతున్నారు. చిన్న పిల్లలు కూడా ఫోన్‌ను వదిలి ఉండటం లేదు. కొందరు సోషల్ మీడియా యూజ్ చేస్తుంటే.. ఇంకొందరు గేమ్స్ అంటూ.. చాటింగ్ అంటూ ఫోన్‌కు అతుక్కుపోతున్నారు. కాసేపు ఫోన్ కనిపించకపోయినా కంగారు పడిపోతున్న రోజులువి. అయితే.. తాజాగా చత్తీస్‌గడ్‌లో ఓ 14 ఏళ్ల బాలిక ఫోన్‌ను ఎక్కువగా వాడసాగింది. అది గమనించిన ఆమె అన్నయ్య.. ఫోన్‌ను ఎక్కువగా యూజ్ చేయొద్దని చెప్పాడు. ఒకటికి రెండుసార్లు చెప్పడంతో ఆమె ఆగ్రహం తెచ్చుకుంది. దాంతో.. ఆగ్రహానికి లోనై గొడ్డలితో సొంత అన్నను నరికి చంపింది.
ఛత్తీస్‌గఢ్ ఖైరాగఢ్ చుయిఖదాన్ గండై జిల్లాలోని అమ్లిదిహ్కల గ్రామంలో శుక్రవారం ఈ దారుణ సంఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ 14 ఏళ్ల బాలిక అబ్బాయిలతో ఫోన్ మాట్లాడసాగింది. అది గమనించిన ఆమె అన్న (18) బాలికను హెచ్చరించాడు. ఫోన్లో అబ్బాయిలతో మాట్లాడటం తనకే మంచిది కాదంటూ సూచించాడు. ఈ నెల 3న ఇదే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో.. మొబైల్ వాడటానికి వీల్లే దు అంటూ తెగేసి చెప్పాడు. దాంతో ఆ బాలిక తన అన్నపై కోపం పెంచుకుంది. అతను నిద్రపోతున్న సమయంలో గొడ్డలి తీసుకుని వచ్చి మెడపై నరికింది. తీవ్రగాయంతో కొట్టుమిట్టాడి యువకుడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఇక హత్య తర్వాత బాలికకు రక్తపు మరకలు అంటుకున్నాయి. దాంతో.. స్నానం చేసి.. రక్తం అంటిన దుస్తులను దాచిపెట్టింది. ఆ తర్వాత తన అన్నయ్యను ఎవరో హత్య చేరాంటూ చుట్టుపక్కల వారికి చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పోలీసులు గట్టిగా నిలదీసి అడిగే సరికి ఆ బాలిక నేరాన్ని ఒప్పుకుంది. తన అన్నను తానే చంపాననీ.. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికను జువైనల్ హోమ్‌కు తరలించారు.