బాలిక‌ను తుపాకీతో కాల్చిన యువ‌కుడు

CCTV footage shows boy shooting girl in Patna.ఇటీవ‌ల మ‌హిళ‌ల‌కు ర‌క్షణ లేకుండా పోతుంది. ఎక్క‌డో ఒక చోట మ‌హిళ‌ల‌పై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Aug 2022 11:20 AM IST
బాలిక‌ను తుపాకీతో కాల్చిన యువ‌కుడు

ఇటీవ‌ల మ‌హిళ‌ల‌కు ర‌క్షణ లేకుండా పోతుంది. ఎక్క‌డో ఒక చోట మ‌హిళ‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతూనే ఉన్నారు. త‌న ప్రేమ‌ను తిర‌స్క‌రించింద‌న్న కోపంతో 15 ఏళ్ల బాలిక‌ను తుపాకీతో కాల్చాడో యువ‌కుడు. ఈ ఘ‌ట‌న బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

రాజ‌ధాని పాట్నాలోని బ్యూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఇంద్ర‌పురి ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కూర‌గాయ‌లు విక్ర‌యించే ఓ వ్య‌క్తి కుమారై స్థానికంగా 9వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఓ యువ‌కుడు త‌న‌ను ప్రేమించాల‌ని బాలిక వెంట ప‌డుతున్నాడు. అయితే ఆ బాలిక అత‌డి ప్రేమ‌ను తిర‌స్క‌రించింది. అయిన‌ప్ప‌టికీ వెంట‌ప‌డుతున్నాడు. ఈ క్ర‌మంలో బుద‌వారం సాయంత్రం బాలిక న‌డుచుకుంటూ వెలుతుండ‌గా తుపాకీతో కాల్చాడు. ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్న బాలిక‌ను స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మెడ‌పై తూటా దిగ‌డంతో ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘ‌ట‌నకు సంబంధించిన దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియోలో.. వీధిలో నుంచి బాలిక న‌డుచుకుంటూ వస్తుండగా ఓ యువకుడు ఆమెను దాటుకుని వచ్చి కొద్ది దూరంలో నిల్చున్నాడు. ఆమె అతడిని దాటి వెళ్లిగానే.. సంచిలోంచి తుపాకీ సి బాలిక మెడ‌పై కాల్చాడు. అనంత‌రం అక్క‌డి నుంచి ప‌రారు అయ్యాడు. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. యువ‌కుడి కోసం గాలింపు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు.

Next Story