స్నేహితుడి పెళ్లికి వెళ్లి వ‌స్తుండ‌గా ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

Car Overturns near Kalwakurthy three dead.నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. క‌ల్వ‌కుర్తి మండ‌లంలోని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Feb 2022 9:49 AM IST
స్నేహితుడి పెళ్లికి వెళ్లి వ‌స్తుండ‌గా ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. క‌ల్వ‌కుర్తి మండ‌లంలోని మార్చాల స‌మీపంలో ఓ కారు అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా.. మ‌రొ విద్యార్థినికి గాయాల‌య్యాయి.

వివ‌రాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా కొండమల్లెపల్లికి చెందిన అరవింద్(23), వర్ధిపట్లకు చెందిన శిరీష(20), మహబూబాబాద్‌కు చెందిన కిరణ్మయి(22), మిర్యాలగూడ‌కు చెందిన రేణుకలు హైద‌రాబాద్‌లోని ఓ క‌ళాశాల‌లో చ‌దువుతున్నారు. గురువారం వెల్దండ మండలం బండోనిపల్లి గ్రామంలో జరిగిన స్నేహితుడి వివాహానికి హాజ‌రై రాత్రి తిరుగు ప్ర‌యాణం అయ్యారు.

వీరు ప్ర‌యాణిస్తున్నారు కారు కల్వకుర్తి మండలం మార్చాల స‌మీపంలోకి రాగానే అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో అరవింద్‌, శిరీష‌, కిర‌ణ్మ‌యి లు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. రేణుక‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయ‌ప‌డిన రేణుక‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను క‌ల్వ‌కుర్తి ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అతి వేగ‌మే ప్ర‌మాదానికి కార‌ణంగా తెలుస్తోంది.

Next Story