దుండిగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
Car Collided with Lorry in Dundigal three dead.మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని
By తోట వంశీ కుమార్ Published on 12 Dec 2021 8:40 AM GMT
మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరుకు చెందిన సంజూ, గణేశ్, అశోక్ తో పాటు విజయవాడకు చెందిన చరణ్ లు హైదరాబాద్‌లోని నిజాంపేట్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు.
శనివారం అర్థరాత్రి దాటిన తరువాత దుండిగల్ బౌరంపేటలో ఉన్న కోకాకోల కంపెనీ వద్ద ఆగి ఉన్న లారీని వీరు కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో సంజూ, గణేశ్, చరణ్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడన అశోక్‌ను సూరారంలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో చరణ్ కారు నడిపినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. వీరంతా మద్యం సేవించినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.