పనస పళ్ళ లారీలో గంజాయి.. ఎలా దొరికారంటే

Cannabis in a Jack fruit truck.ఒడిశాలోని కోరాపుట్ జిల్లా జాలాపుట్ గ్రామం స‌మీపంలో మ‌చ్‌కుంద్ పోలీసులు లారీలో తరలిస్తున్న గంజాయిని స్వాధీనంచేసుకున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 May 2021 1:51 AM GMT
cannabis

ఓ లారీ పనస పండ్ల లోడ్‌తో వేగంగా వెళుతోంది. అందులో ఉన్నవి పనస పండ్లు అని ఊరంతా తెలిసేట్టుగా పళ్ళ వాసన గుప్పుమంటూ వెళుతోంది. మామ్ములుగా, తమ రొటీన్ ప్రకారంపోలీసులు ఆపి తనిఖీ చేశారు. అప్పుడు ఓ డ్రగ్ మాఫియా స్కాం బట్టబయిలైంది. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా జాలాపుట్ గ్రామం స‌మీపంలో మ‌చ్‌కుంద్ పోలీసులు లారీలో తరలిస్తున్న గంజాయిని స్వాధీనంచేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న 1,008 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప‌న‌స పండ్ల లోడుతో ఒడిశా నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరుకు వెళ్తున్న లారీని ఆపి త‌నిఖీ చేయ‌గా.. గంజాయి గుట్టు బట్టబయిలైందని పోలీసులు వెల్లడించారు.

తనిఖీలు చేస్తుండగా.. ప‌న‌స పండ్ల కింద ఉన్న బ‌స్తాల్లో గంజాయి ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. వెంట‌నే లారీని సీజ్ చేసి పోలీస్ స్టేష‌న్‌కు తరలించారు. గంజాయి బ‌స్తాల‌ను దించి తూకం వేయ‌గా 1,008 కిలోల బ‌రువు ఉందని పోలీసులు తెలిపారు. అంటే ఈ గంజాయి మొత్తం విలువ కోటి రూపాయ‌లకు పైగా ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. లారీ డ్రైవ‌ర్ స‌హా మొత్తం ముగ్గురు నిందితుల‌ను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

నిజానికి మన దేశంలో గంజాయి వాడకంపై నిషేధం ఉంది.. కానీ చాలా దేశాల్లో గంజా ని అనుమతిస్తున్నారు. ఉరుగ్వేలో ప్రజలు గంజాయి వాడటానికి అనుమతి ఉంది ఐతే.. వాడే వారి వయసు 18 ఏళ్లకు మించి ఉండాలి. అక్కడ స్థానిక మందుల షాపుల్లో గంజాయిని కూడా అమ్ముతారు. కానీ చాలా పరిమితంగా ఇస్తారు. ఉరుగ్వే ప్రభుత్వం ఎవరైనా ఇంటి దగ్గర 6 వరకూ గంజాయి మొక్కల్ని పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది.కెనడా, దక్షిణ ఆఫ్రికా, ఈక్వెడార్ ఇంకా అమెరికా లోని వాషింగ్టన్ డీసీ సహా 11 రాష్ట్రాల్లో గంజాయి వాడకానికి అనుమతులు ఉన్నాయి. మన దేశంలో ఏ అనుమతులూ లేకపోయినా ఇష్టమొచ్చినట్లు సాగు జరుగుతోంది. అమ్మకం, వాడకం అన్నీ అయిపోతున్నాయి. ఇక బ్యాన్ ఉండి ఏం లాభం అని ప్రజలు అనుకునే పరిస్థితికి వచ్చేసాం.


Next Story