చార్మినార్‌లో కిడ్నాప్.. సంగారెడ్డిలో వ్యాపార వేత్త దారుణ హత్య
Business man Murder at Sangareddy.చార్మినార్ నగరంలో ఓ వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య
By తోట వంశీ కుమార్ Published on
22 Aug 2021 7:06 AM GMT

చార్మినార్ నగరంలో ఓ వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య నగరంలో కలకలం రేపుతోంది. ఈ దారుణ హత్యను అతడి స్నేహితులే చేయడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. వ్యాపార వేత్త మధుసూదన్ రెడ్డి దగ్గర నుంచి అతడి మిత్రులు రూ.40లక్షల రుణం తీసుకున్నారు. తీసుకున్న రుణాన్ని చెల్లించాలని మిత్రులను మధుసూదన్ రెడ్డి కోరారు. దీంతో ఈ నెల 19న మధుసూదన్‌రెడ్డిని కిడ్నాప్ చేశారు అతడి స్నేహితులు.
కిడ్నాప్ తో ఆగలేదు. అతడిని చార్మినార్ నుంచి సంగారెడ్డి తీసుకెళ్లి అక్కడ హత్య చేశారు. అనంతరం ఓ పొలంలో అతడి మృతదేహాన్ని పాతిపెట్టారు. అయితే.. మధుసూదన్ రెడ్డి కిడ్నాప్ హత్య కేసులో మిత్రుల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story