అదుపుత‌ప్పి బోల్తాప‌డిన బ‌స్సు.. 12 మంది దుర్మ‌ర‌ణం

Bus accident in northern Mexico.మెక్సికోలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. అదుపు త‌ప్పి ఓ బ‌స్సు బోల్తా ప‌డ‌డంతో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jun 2021 2:30 AM GMT
అదుపుత‌ప్పి బోల్తాప‌డిన బ‌స్సు.. 12 మంది దుర్మ‌ర‌ణం

మెక్సికోలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. అదుపు త‌ప్పి ఓ బ‌స్సు బోల్తా ప‌డ‌డంతో 12 మంది మృతి చెంద‌గా 10 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న ఈ శాన్య మెక్సికోలోని ఓ హైవేపై చోటు చేసుకుంది. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 39 మంది ప్ర‌యాణీకులు ఉన్నారు. స‌రిహ‌ద్దు న‌గ‌ర‌మైన రేనోసా నుంచి న్యువో లియోన్ రాష్ట్రంలోని మోటెర్రే బ‌స్సు వెలుతోంది. ఈ క్ర‌మంలో త‌మౌలిపాస్ రాష్ట్రంలో అదుపుత‌ప్పి బోల్తా పడింది.

కాగా.. ప్ర‌మాదంపై పౌర రక్షణ సమన్వయకర్త పెడ్రో గ్రనాడోస్ మాట్లాడుతూ.. ఈశాన్య మెక్సికోలోని బస్సు బోల్తా పడటంతో 12 మంది మృతి చెందగా, 10 మంది గాయపడ్డారన్నారు. తమౌలిపాస్ రాష్ట్రంలో ప్రమాద స్థలంలో తొమ్మిది మంది మరణించగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో మరణించినట్లు వెల్ల‌డించారు. ఈ బస్సు సరిహద్దు నగరమైన రేనోసా మరియు పొరుగున ఉన్న న్యువో లియోన్ రాష్ట్రంలోని మోంటెర్రే మధ్య ప్రయాణిస్తుంద‌ని తెలిపారు.

క్రిమినల్ ముఠాలు కిడ్నాప్ మరియు దోపిడీ బెదిరింపు కారణంగా మెక్సికోలో తమౌలిపాస్ రహదారులు అత్యంత ప్రమాదకరమైనవిగా పరిగణించబడుతున్నాయి. కానీ నేరస్థులు ప్రమాదానికి కారణమయ్యారనడానికి ఎటువంటి ఆధారాలు లేవని రాష్ట్ర అధికారులు తెలిపారు. బ‌స్సు డ్రైవ‌ర్ వాహ‌నంపై నియంత్ర‌ణ కోల్పోవ‌డం వ‌ల్లే ప్ర‌మాదం జరిగి ఉండ‌వ‌చ్చున‌ని అధికారులు చెబుతున్నారు.

Next Story