తల ఒకచోట, మొండెం ఒకచోట.. స్నేహితుడితో భార్యతో ఎఫైర్.. చివరికి..
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో సంచలనం సృష్టించిన మొండెం లేని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
By - అంజి |
తల ఒకచోట, మొండెం ఒకచోట.. స్నేహితుడితో భార్యతో ఎఫైర్.. చివరికి..
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో సంచలనం సృష్టించిన మొండెం లేని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కిరాతకానికి ఒడిగట్టిన ఆమె ప్రియుడిని, అతడికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం.. బాధితురాలు బబ్లీ, తన భర్త అజయ్ క్యాన్సర్‌తో మరణించిన తర్వాత వికాస్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వికాస్ గతంలో అజయ్‌తో కలిసి ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో పనిచేసేవాడు, ఆ క్రమంలోనే ఆమె కుటుంబంతో పరిచయం ఏర్పడింది. అయితే, వికాస్ కుటుంబ సభ్యులు అతనికి 2025 డిసెంబర్‌లో వేరే చోట వివాహం నిశ్చయించారు.
ఈ విషయం తెలుసుకున్న బబ్లీ, తననే పెళ్లి చేసుకోవాలని వికాస్‌పై ఒత్తిడి తెచ్చింది. ఈ వివాదమే ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడిని తట్టుకోలేక వికాస్ ఆమెను అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. తన బావ అమన్, మరో సహచరుడితో కలిసి బబ్లీని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, పదునైన ఆయుధంతో హత్య చేశారు. అనంతరం ఆమెను ఎవరూ గుర్తుపట్టకూడదనే ఉద్దేశంతో తల నరికి, మొండెం పడి ఉన్న చోటుకు సుమారు 500 మీటర్ల దూరంలో పడేశారు. నాలుగు రోజుల క్రితం తల లేని మృతదేహం లభించడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం చేతిపై ఉన్న గుర్తులను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడంతో, బబ్లీ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి ఆమెను గుర్తించారు. నిఘా వర్గాలు మరియు సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు వికాస్, అమన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి హత్యకు వాడిన ఆయుధంతో పాటు రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మూడో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సీనియర్ పోలీస్ అధికారి శంకర్ ప్రసాద్ తెలిపారు.