Video: దారుణం.. 4 ఏళ్ల చిన్నారిని నేలకేసి కొట్టాడు
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కేవలం పాత కక్షలను మనసులో పెట్టుకుని, ఒక వ్యక్తి నాలుగేళ్ల చిన్నారిపై...
By - అంజి |
Video: దారుణం.. 4 ఏళ్ల చిన్నారిని నేలకేసి కొట్టాడు
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కేవలం పాత కక్షలను మనసులో పెట్టుకుని, ఒక వ్యక్తి నాలుగేళ్ల చిన్నారిపై కనికరం లేకుండా దాడికి తెగబడ్డాడు. వసాయ్ ప్రాంతంలోని ఒక నివాస సముదాయంలో సోమవారం రాత్రి ఈ దారుణం జరిగింది. పార్క్ చేసి ఉన్న ఆటో రిక్షాలో కూర్చున్న చిన్నారిని నిందితుడు సందీప్ పవార్ బలవంతంగా బయటకు లాగి, నేలకేసి కొడుతూ విచక్షణారహితంగా దాడి చేశాడు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. నిందితుడు పవార్ చిన్నారి తలను ఆటోకు బాదడమే కాకుండా, తల కిందులుగా విసిరికొట్టాడు. బాలుడిని కాపాడేందుకు వచ్చిన అతడి నానమ్మపై కూడా నిందితుడు దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ముంబైలోని వోకార్డ్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు పవార్‌కు, బాలుడి కుటుంబానికి మధ్య కొన్ని రోజుల క్రితం జరిగిన చిన్న గొడవే ఈ దాడికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Vasai, Maharashtra: After a dispute with a father, a man allegedly attacked a 4-year-old child, grabbing him from an auto and slamming him to the ground inside a housing society. Disturbing. pic.twitter.com/1pfky2baOE
— Believer (@PredatorVolk) March 31, 2026
క్రూరమైన దాడి చేసిన తర్వాత కూడా నిందితుడు ఏమాత్రం పశ్చాత్తాపం చెందకపోవడం గమనార్హం. "నేను పగ తీర్చుకున్నాను" అంటూ సొసైటీ నివాసితుల ముందే బహిరంగంగా వ్యాఖ్యానించాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు వసాయ్ పోలీసులు సందీప్ పవార్‌పై హత్యాయత్నం, జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.