ఆస్ప‌త్రిలో దారుణం.. శ‌స్త్ర‌చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటుండ‌గా..

Brutal assasinate hospital in Krishna district.ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఓ వ్య‌క్తిని క‌త్తితో విచ‌క్ష‌ణార‌హితంగా పొడిచి హ‌త్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Feb 2021 10:05 AM IST
Brutal assasinate hospital in Krishna district

ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఓ వ్య‌క్తిని క‌త్తితో విచ‌క్ష‌ణార‌హితంగా పొడిచి హ‌త్య చేసిన ఘ‌ట‌న మంగ‌ళ‌వారం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం కొండ‌ప‌ల్లిలో మొగిలి ప్ర‌భాక‌ర్ రావు(42) త‌న కుటుంబంతో క‌లిసి నివాసం ఉంటున్నారు. కంటికి శ‌స్త్ర చికిత్స చేయించుకునేందుకు ఉయ్యూరులోని రోట‌రీ నేత్ర వైద్య‌శాల‌కు సోమ‌వారం వ‌చ్చారు. మంగ‌ళ‌వారం అత‌డికి శ‌స్త్ర చికిత్సను నిర్వ‌హించి వార్డుకు త‌ర‌లించారు. అత‌డు వార్డులో విశాంత్రి తీసుకుంటున్నారు.

ఈ స‌మ‌యంలో ప్ర‌భాక‌ర్ రావు భార్య‌, త‌ల్లి సామ్రాజ్యం మందులు తీసుకురావ‌డానికి బ‌య‌టి వెళ్లారు. ఇది గ‌మ‌నించిన ఓ వ్య‌క్తి ఆస్ప‌త్రి వార్డులోకి ప్ర‌వేశించాడు. ప్ర‌భాక‌ర్ రావు ద‌గ్గ‌రికి వ‌చ్చి సంచిలో నుంచి క‌త్తి తీశాడు. ప్ర‌భాక‌ర్ రావుపై విచ‌క్ష‌ణార‌హితంగా పొడిచాడు. అనంత‌రం పారీపోయేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. ప‌క్క‌న ఉన్న రోగుల బంధువులు వెంబ‌డించి నిందితుడిని ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు. తీవ్ర ర‌క్తం స్రావం కావ‌డంతో ప్ర‌భాక‌ర్ రావును ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించి ప్రాథ‌మిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం 108లో విజ‌య‌వాడ ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించ‌గా.. అక్క‌డ చికిత్స పొందుతూ మృతి చెందాడు. హత్యకు పాతకక్షలే కారణమని, నిందితుడు కూడా హతుడి స్వగ్రామానికి చెందిన రమేష్‌ అని పోలీసులు అనుమానిస్తున్నారు.




Next Story