కన్నకూతురి పై తండ్రి అఘాయిత్యం.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న సోదరుడు

Brother ends life after audio clip of sister's rape by dad goes viral.మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతుంది. ఎన్ని క‌ఠిన

By M.S.R  Published on  6 Sept 2021 1:43 PM IST
కన్నకూతురి పై తండ్రి అఘాయిత్యం.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న సోదరుడు

మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతుంది. ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. ప‌రాయి వారి నుంచే కాకుండా.. సొంత వారి నుంచి కూడా మ‌గువ‌లు వేదింపుల‌ను ఎదుర్కొంటున్నారు. రాజస్థాన్‌లో అమానుష ఘ‌ట‌న చోటు చేసుకుంది. కంటికి రెప్ప‌లా కుమారైను కాపాడాల్సిన తండ్రే.. ఆమెపై క‌న్నేశాడు. కూతురిపై అఘాయిత్యానికి ఒడిగ‌ట్టాడు. ఈ విష‌యం తెలిసిన ఆమె సోద‌రుడు.. అవ‌మానంతో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

ఓ బాలిక.. తండ్రి తనపై చేసిన దారుణాన్ని తన అత్తకు వివరించింది. ఈ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. దాదాపు 32 నిమిషాల పాటు ఉన్న ఈ ఆడియో క్లిప్ వెలుగులోకి రావడంతో దారుణం బయటపడింది. తన తండ్రి చేసిన ఘోరం తెలుసుకున్న ఆ బాలిక సోదరుడు.. వెంటనే దగ్గరలోని చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు బాలిక ఇంటికి చేరుకునే సమయానికి.. నిందితుడు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మొబైల్ ఫోన్ కొనిపెడతానని.. కారులో బయటకు తీసుకువెళ్లి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ రోజు బాలికను బయటకు తీసుకువెళ్లే సమయంలో.. ఆమె సోదరుడిని కూడా తీసకువెళ్లమని తల్లి కోరగా.. తండ్రి నిరాకరించాడు. ఈ దారుణాల్ని చాలాకాలం పాటూ భరిస్తూ వచ్చిన బాలిక.. చివరికి తన అత్తవద్ద చెప్పుకుంది. బాలిక ఫిర్యాదును బట్టి ఆమె తండ్రిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

Next Story