విషాదం.. మరికొన్ని గంటల్లో పెళ్లి.. అంతలోనే వధువు ఆత్మహత్య

Bride commits suicide hours before marriage in nizambad district. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యాయి.

By అంజి
Published on : 11 Dec 2022 10:10 AM IST

విషాదం.. మరికొన్ని గంటల్లో పెళ్లి.. అంతలోనే వధువు ఆత్మహత్య

మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యాయి. పెళ్లి కూతురు కూడా ముస్తాబైంది. అయితే అంతలోనే ఏమైందో ఏమో తెలియదు.. కానీ పెళ్లి కూతురు తన రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నిజాబాద్‌ జిల్లా నవిపేటలో ఆదివారం నాడు జరిగింది. ఇవాళ ఉదయం 10 గంటలకు పెళ్లి జరగాల్సి ఉండగా.. రవళి అనే నవ వధువు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కాబోయే పెళ్లి కొడుకు వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని రవళి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

రవళిని పెళ్లికి ముందు మానసికంగా వేధింపులకు గురి చేశాడని చెబుతున్నారు. శనివారం నాడు రాత్రి కూడా రవళికి కాబోయే భర్త ఫోన్ చేశాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పెళ్లి కూతురు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వధువు ఆత్మహత్యతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. కన్యాదానం చేసి అత్తారింటికి పంపాల్సిన తమ కూతురిని కాటికి సాగనంపాల్సిన పరిస్థితి రావటంతో తల్లిదండ్రులు బోరునా విలపిస్తున్నారు. తమ కూతరు చావుకు కారణమైన పెళ్లి కుమారుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story