బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్వోపౌలో రాష్ట్రంలో టగ్వా సిటీ సమీపంలో టగ్వా-తక్వరితుబా రహదారిపై ఉదయం 7 గంటల సమయంలో బస్సు-ట్రక్కు ఢీకొనగా 37 మంది మృతి చెందారు.మరో 16 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఓ టెక్స్ టైల్స్ కంపెనీ ఉద్యోగులు ప్రయాణిస్తున్న బస్సు-ట్రక్కును కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మృతి చెందిన మృతదేహాలను బయటకు తీసే వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ప్రమాదం జరిగినే నేపథ్యంలో బాధితుల కుటుంబాలకు సంతాపంగా టగ్వా మున్సిపాలిటీ పట్టణలో మూడు రోజుల పాటు సంతాపాన్ని ప్రకటించారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 53 ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా దాదాపు నాలుగు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది