దారుణం.. చాక్లెట్ల ఆశచూపి ఐదేళ్ల పాపపై లైంగిక దాడి
ఐదేళ్చిల చిన్నారిపై ఓ 17 ఏళ్ల బాలుడు ఈ నెల 22న లైంగిక దాడికి పాల్పడ్డాడు.
By Srikanth Gundamalla Published on 26 Jan 2024 10:59 AM ISTదారుణం.. చాకెట్ల ఆశచూపి ఐదేళ్ల పాపపై లైంగిక దాడి
రోజురోజుకు మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. కొందరు కామాంధులు కళ్లుమూసుకుపోయి వ్యవహరిస్తున్నారు. మహిళలు బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. తెలిసిన వారే కదా అని నమ్మితే వారూ కూడా క్రూరంగా మారిపోయి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వరుసలు మరిచి కామంతో కళ్లు మూసుకుపోయి వ్యవహరిస్తుంటారు. కొందరు మరీ దారుణంగా చిన్న పిల్లలపై కూడా లైంగిక దాడులు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే వనపర్తి జిల్లా ఆత్మకూరులో చోటుచేసుకుంది.
ఆత్మకూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారిపై ఓ 17 ఏళ్ల బాలుడు ఈ నెల 22న లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 22న ఆత్మకూరు మండలంలో ఐదేల్ల చిన్నారికి చాకెట్లు ఇస్తానని ఆశ చూపిన అదే వాడకు చెందిన ఒక 17 ఏళ్ల బాలుడు ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని చెప్పాడు. ఇక ఆ చిన్నారి భయపడిపోయి ఎవరికీ ఆ విషయం చెప్పలేదు. రెండ్రోజుల తర్వాత జరిగిన విషయాన్ని ఆ చిన్నారి తల్లిదండ్రులకు తెలియజేసింది. ఇక వారు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. 17 ఏళ్ల బాలుడిపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ ఫిర్యాదుపై డీఎస్పీ ఆనందరెడ్డి నేతృత్వంలో విచారణ జరిపించారు. పోలీసుల సంరక్షణలో చిన్నారికి వైద్యపరీక్షలు చేశారు. ఆ తర్వాత గురువారం బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అత్యాచారానికి పాల్పడ్డ బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా.. దీనికి గురించి తెలుసుకున్న స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.