మాజీ ప్రియుడి న్యూడ్ ఫొటోలను మహిళ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ విషయం తెలిసిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ మహిళ అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించింది. అయితే ముందస్తు బెయిల్‌పై విచారణ చేపట్టిన కింది కోర్టు, హైకోర్టు కూడా.. ఆ మహిళకు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. వివాహితుడైన వ్యక్తి, మహిళకు 2010 నుంచి సంబంధం ఉంది. 2020లో ఇద్దరి మధ్యలో గొడవలు రావడంతో విడిపోయారు.
అప్పటి నుంచి మాజీ ప్రియుడిపై కక్ష పెంచుకున్న మహిళ.. ఓ నకిలీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసింది. ఆ వ్యక్తికి సంబంధించిన అసభ్యకర ఫొటోలను అందులో పోస్ట్ చేసింది. దీనిని ఆ వ్యక్తి కూతురు చదువుతున్న స్కూల్ ఇన్‌స్టా ఖాతాకు ట్యాగ్ చేసింది. అనంతరం ఆ వ్యక్తి న్యూడ్ ఫొటోలను అతడి భార్య ఈమెయిల్‌కు పంపింది. దీంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మహిళపై పలు సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. ఇది తెలిసిన ఆ మహిళ.. పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించింది.
అయితే ఆ మహిళ పిటిషన్‌ను ట్రయల్ కోర్టు తిరస్కరించింది. దీంతో మహిళ ముంబై హైకోర్టు వెళ్లింది. మహిళ చేసిన పనికి.. బాధితుడితోపాటు అతడి కుమార్తె కూడా తీవ్ర అవమానం పాలయ్యారని, వారి వ్యక్తిగత జీవితం నాశనమైందని ఆ వ్యక్తి తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపాడు. పోలీస్ దర్యాప్తునకు ఆ మహిళ సహకరించడం లేదని, కంప్యూటర్, మొబైల్‌ను ఇంకా స్వాధీనం చేసుకోలేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఆమె అరెస్ట్‌లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను పాటించాలని ఆదేశించింది.