శ్రీకాకుళం జిల్లాలో పేలుడు.. ఇద్ద‌రు చిన్నారుల‌కు తీవ్ర‌గాయాలు

Blast in Tekkali.ఓ ఇంట్లో అక్ర‌మంగా బాణాసంచా త‌యారు చేస్తుండ‌గా పేలుడు సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు చిన్నారుల‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Nov 2021 10:11 AM GMT
శ్రీకాకుళం జిల్లాలో పేలుడు.. ఇద్ద‌రు చిన్నారుల‌కు తీవ్ర‌గాయాలు

ఓ ఇంట్లో అక్ర‌మంగా బాణాసంచా త‌యారు చేస్తుండ‌గా పేలుడు సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు చిన్నారుల‌కు తీవ్ర‌గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. టెక్క‌లి ప‌ట్ట‌ణంలోని క‌చేరీ వీధిలోని ఓ ఇంట్లో అక్ర‌మంగా బాణాసంచా త‌యారు చేస్తుండ‌గా.. బుధ‌వారం మ‌ధ్యాహ్నాం పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో సాయి, హ‌రి అనే ఇద్ద‌రు చిన్నారుల‌కు తీవ్ర‌గాయాలు అయ్యాయి.

స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయ‌ప‌డిన ఇద్ద‌రు చిన్నారుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాణా సంచా అక్ర‌మంగా ఇంకా ఎవ‌రైనా త‌యారు చేస్తున్నారా..? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా.. భారీ శ‌బ్దంతో పేలుడు సంభ‌వించ‌డంతో స్థానికులు తొలుత ఏం జ‌రిగిందో తెలియ‌క కంగారు ప‌డ్డారు.

Next Story
Share it