డీసీఎంను ఢీకొట్టిన బైక్‌.. ఇద్ద‌రు స్నేహితుల మృతి

Bike Crash with Van in Dundigal.మేడ్చ‌ల్ జిల్లాలోని దుండిగల్ బౌరంపేట్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Sep 2021 5:22 AM GMT
డీసీఎంను ఢీకొట్టిన బైక్‌.. ఇద్ద‌రు స్నేహితుల మృతి

మేడ్చ‌ల్ జిల్లాలోని దుండిగల్ బౌరంపేట్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న డీసీఎంను ఓ బైక్ ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు స్నేహితులు అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించారు. మృతుల‌ను సూరారం నివాసి ప్రమోద్ రెడ్డి(22), వరంగల్‌కు చెందిన సునై రెడ్డి(22)గా గుర్తించారు.

సూరారంలో ఉంటున్న ప్ర‌మోద్ రెడ్డిని క‌లిసేందుకు సునై రెడ్డి వ‌చ్చారు. వీరిద్ద‌రు క‌లిసి పల్సర్ బైక్‌పై బ‌య‌ట‌కు వెళ్లారు. అర్థ‌రాత్రి 12గంట‌ల ప్రాంతంలో దుండిగల్‌ పరిధిలోని బౌరంపేట్‌లో ఆగి ఉన్న డీసీఎంను వెన‌క నుంచి వేగంగా ఢీ కొట్టారు. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు ఘ‌ట‌నాస్థ‌లంలోనే ప్రాణాలు కోల్పోయారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్నారు. మృత‌దేహాల‌ను ప‌రిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అతి వేగం, నిర్ల‌క్ష్య‌మే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it