బీహార్‌లో దారుణం.. సీపీఐ నేత దారుణ హత్య
బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. సీపీఐ (ఎంఎల్) నేత సునీల్ చంద్రవంశీని కొందరు దుండగులు దారుణంగా కాల్చి చంపేశారు.
By Srikanth Gundamalla Published on 10 Sept 2024 10:02 AM ISTబీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. సీపీఐ (ఎంఎల్) నేత సునీల్ చంద్రవంశీని కొందరు దుండగులు దారుణంగా కాల్చి చంపేశారు. ఆయన మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలోనే కాల్పులకు తెగబడ్డారు. బైక్‌పై వచ్చి చుట్టుముట్టి దుండుగులు తుపాకీతో కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో తీవ్ర రక్తస్రావమైన సునీల్ చంద్ర వంశీ ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు.
కాల్పుల తర్వాత సునీల్ చంద్రవంశీని పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆయన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇక నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని అన్నారు. సీపీఐ (ఎంఎల్)నేతను రోడ్డుపై కాల్చి చంపిన సంఘటన కలకలం రేపుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
కాగా.. కాల్పల సంఘటన అర్వాల్ జిల్లాలోని కింజర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చక్కన్ బిఘా గ్రామంలో మార్కెట్ వద్ద జరిగింది. ఈ సంఘటనపై ఎస్పీ రాజేంద్ర కుమార్ భిల్ స్పందించారు. కాల్పులకు పాతకక్షలే కారణం అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. నేరస్తులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసుల బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పోలీసులు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారని అన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల నుంచి కొంత సమాచారం సేకరించామనీ.. వారికి అనుమానం ఉన్న వారినీ విచారిస్తున్నామని ఎస్పీ రాజేంద్ర కుమార్ భిల్ వెల్లడించారు.