దారుణం.. ప్రేమించాడని దాన్ని కోసేశారు

Bihar boy killed over love affair.బిహార్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన పాపానికి ఆ యువ‌కుడిని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 July 2021 1:40 PM IST
దారుణం.. ప్రేమించాడని దాన్ని కోసేశారు

బిహార్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన పాపానికి ఆ యువ‌కుడిని ఏకంగా కాటికే పంపారు అమ్మాయి కుటుంబ స‌భ్యులు. ఎంత దారుణ‌మంటే.. ఆ యువ‌కుడిని ప‌ట్టుకుని చిత‌క‌బాది అనంత‌రం అత‌డి మ‌ర్మాంగాన్ని కోసేశాడు. ఈ ఘ‌ట‌న ముజఫర్‌ఫూర్‌ జిల్లాలో జరిగింది. వివ‌రాల్లోకి వెళితే.. రేవురా రాంపుర్‌ గ్రామానికి చెందిన సౌరభ్‌ కుమార్(22) అనే యువకుడు‌, తమ పక్క గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ క్రమంలో సౌరభ్‌ ప్రతిరోజు సోర్బారా గ్రామానికి వెళ్లి ప్రియురాలిని కలుస్తుండేవాడు.

ఈక్ర‌మంలో శుక్ర‌వారం.. అమ్మాయి ఇంట్లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో సౌర‌భ్ అమ్మాయి ఇంటికి వెళ్లాడు. ఇద్ద‌రు ఏకాంతంగా ఉన్న స‌మ‌యంలో అమ్మాయి కుటుంబ స‌భ్యులు ఇంటికి వ‌చ్చారు. వారిద్ద‌రిని చూసి ఆగ్ర‌హాంతో ఊగిపోయారు. సౌర‌భ్ ప‌ట్టుకుని ఇనుప‌కడ్డీలు, రాడ్‌ల‌తో దారుణంగా కొట్టారు. అంత‌టితో ఆగ‌కుండా అత‌డి మ‌ర్మాంగాన్ని క‌త్తితో కోసేశారు. దీంతో సౌర‌భ్ అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లాడు. గ‌మ‌నించిన స్థానికులు.. తీవ్ర ర‌క్త‌స్రావం అవుతుండ‌డంతో అత‌డిని ఆస్ప‌త్రిలో చేర్పించారు. అయితే.. చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం సౌర‌భ్ క‌న్నుమూశాడు. దీంతో కోపంతో రగిలిపోయిన యువకుడి బంధువులు, యువతి ఇంటిముందు సౌరభ్‌ మృతదేహానికి శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా.. మృతుడి బంధువులు, యువతి సోదరులపై ఫిర్యాదు చేశారు.

దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అశోక్‌ ఠాకుర్‌, రంజిత్‌ కుమార్‌, ముకేష్‌ కుమార్‌లను అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలిపారు. ప‌రారీలో ఉన్న వారిని త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌ని డీఎస్పీ రాజేష్‌ కుమార్ తెలిపారు.ఈ ఘ‌ట‌న‌తో గ్రామంలో ఉద్రిక‌త్త త‌లెత్త‌డంతో.. గ‌స్తీని పెంచారు.

Next Story