భోపాల్‌లో ఘోరం: మైనర్ బాలికపై నాలుగు కార్లలో ఇద్దరు అత్యాచారం!
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. 11వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై...
By - అంజి |
భోపాల్‌లో ఘోరం: మైనర్ బాలికపై నాలుగు కార్లలో ఇద్దరు అత్యాచారం!
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. 11వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై నిందితులు నాలుగు వేర్వేరు కార్లలో అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా, వీడియోలు తీసి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డారు. ప్రధాన నిందితుడు అసఫ్ అలీ ఖాన్‌ను ఫిబ్రవరి 3న పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రస్తుతం అతడు జైలులో ఉన్నాడు. అతని సహచరుడు, భోపాల్‌లో జిమ్ నడుపుతున్న మేజ్ ఖాన్‌ను ఫిబ్రవరి 8న అదుపులోకి తీసుకున్నారు. నేడు (ఫిబ్రవరి 13) వరకు మేజ్ ఖాన్ పోలీస్ రిమాండ్‌లో ఉన్నాడు.
ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోలీస్ కమిషనర్, ఏసీపీ అంకితా ఖత్రకర్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. ఖానుగావ్ ప్రాంతంలో ఔసాఫ్ అలీ ఖాన్ ఒక థార్ (Thar SUV) కారులో బాలికపై దాడి చేస్తుండగా, మజ్ ఖాన్ కిటికీ బయట నుంచి ఐఫోన్‌తో రహస్యంగా వీడియో తీశాడు. ఆ వీడియోను వైరల్ చేస్తామని బెదిరించి బాలిక వద్ద నుండి రూ. 40,000 వసూలు చేశారు. అంతేకాకుండా, పలుమార్లు ఆమెను లైంగికంగా వేధించారు.
నేరానికి ఉపయోగించిన థార్ సహా నాలుగు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. థార్ కారును సీహోర్ జిల్లాలోని ఒక గ్రామంలో దాచిపెట్టగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరో సంచలన విషయం ఏమిటంటే.. కోహెఫిజా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఒక హెడ్ కానిస్టేబుల్ నిందితుడు మజ్ ఖాన్‌కు సమాచారం లీక్ చేస్తున్నట్లు తేలింది. దీంతో సదరు కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. నేరానికి వాడిన ఐఫోన్ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు.