బెంగళూరులో దారుణం.. వీడియో కాల్‌లో మహిళా న్యాయవాది దుస్తులు విప్పించి..

బెంగుళూరులోని ఓ మహిళ తనను కొందరు వ్యక్తులు మోసగించారని, వీడియో కాల్‌లో దుస్తులు విప్పించి మోసగించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

By అంజి  Published on  10 April 2024 6:46 AM IST
Bengaluru, woman lawyer, scammers, customs officers

బెంగళూరులో దారుణం.. వీడియో కాల్‌లో మహిళా న్యాయవాది దుస్తులు విప్పించి..

బెంగుళూరులోని ఓ మహిళ తనను కొందరు వ్యక్తులు మోసగించారని, వీడియో కాల్‌లో దుస్తులు విప్పించి మోసగించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 10 లక్షల రూపాయలను కూడా మోసగాళ్లు మోసం చేశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆ మహిళ తన ఫిర్యాదులో ఏప్రిల్ 5న ముంబైలోని కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌లో అధికారులమని చెప్పుకునే కొందరు వ్యక్తులు తనను సంప్రదించారని తెలిపారు. మోసగాళ్లు తన పేరు మీద డ్రగ్స్ ప్యాకేజీ ఉందని సింగపూర్ నుంచి పంపించారని, 'నార్కోటిక్స్' టెస్ట్ కోసం వీడియో కాల్‌లో బట్టలు విప్పమని అడిగారని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

ఇది రెండు రోజుల పాటు కొనసాగింది, దీని తరువాత మోసగాళ్ళు మహిళను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. ఆమె తమ ఖాతాకు రూ. 10 లక్షలు బదిలీ చేయకపోతే వీడియోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తామన్నారు. దీంతో భయాందోళనకు గురైన ఆ మహిళ చెప్పిన మొత్తాన్ని తమ ఖాతాకు బదిలీ చేసింది. దీంతో ఆమె ఏప్రిల్ 7న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దోపిడీ, మోసానికి సంబంధించి ఐటీ చట్టంతోపాటు ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story