బెంగళూరు బాగలకుంటె ఎంఈఐ లేఔట్‌కు చెందిన విద్యాజ్యోతి (29) బాష్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. తొమ్మిది రోజుల క్రితమే ఆమె తాను ప్రేమించిన కొడగు యువకుడిని ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. అయితే ఆమె పచ్చని సంసారంలో జ్యోతిష్యుడి మాటలు నిప్పులు పోశాయి. విద్యాజ్యోతి జాతకాన్ని చూసిన ఓ జ్యోతిష్యుడు.. "నీకు ఆయుష్షు తక్కువ, త్వరలోనే నీ నూకలు చెల్లుతాయి" అంటూ ఆమెను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేశాడు. ఆ గండం నుంచి బయటపడాలంటే తొమ్మిది రోజుల పాటు పూజలు చేయాలని, చివరి రోజైన శుక్రవారం మెడలోని తాళిని తీసి అమ్మవారికి సమర్పించాలని సలహా ఇచ్చాడు.
జ్యోతిష్యుడి మాటలతో విపరీతంగా భయపడిపోయిన ఆమె, ఆయన చెప్పినట్టే ఎనిమిది రోజులు పూజలు చేసింది. తొమ్మిదో రోజున తాళిని తీసి అమ్మవారికి ఇచ్చే క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైంది. కుటుంబ సభ్యులు ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఓ మంచి హోదాలో ఉన్న యువతి, మూఢనమ్మకాలను నమ్మి ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి సదరు జ్యోతిష్యుడి వివరాలు సేకరిస్తున్నారు.