రక్తంతో తడిసిన బట్టలతో పోలీస్‌స్టేషన్‌కు.. ఇంటి తాళాలు ఇచ్చి ఓ విష‌యం చెప్పాడు

Bengaluru man surrenders in blood-soaked clothes after killing his wife.బెంగళూరులో 42 ఏళ్ల వ్యక్తి రక్తంతో తడిసిన

By M.S.R
Published on : 23 Feb 2022 10:42 AM IST

రక్తంతో తడిసిన బట్టలతో పోలీస్‌స్టేషన్‌కు.. ఇంటి తాళాలు ఇచ్చి ఓ విష‌యం చెప్పాడు

బెంగళూరులో 42 ఏళ్ల వ్యక్తి రక్తంతో తడిసిన బట్టలతో పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి తన భార్య, అత్తగారిని హత్య చేశానని చెప్పి లొంగిపోయాడు. ఈ సంఘటన మూడలపాళ్యం సమీపంలోని సంజీవిని నగర్‌లో మంగళవారం(ఫిబ్రవరి 21 ) చోటు చేసుకుంది. తమ పిల్లలను స్కూల్‌లో దించిన తర్వాత రవికుమార్ ఇంటికి తిరిగి వచ్చాడు. ఉదయం 10.15 గంటల సమయంలో అతడికి, అతని భార్య సునీత (38) మధ్య వాగ్వాదం జరిగింది. గత ఆరు నెలలుగా సునీత అక్రమ సంబంధం పెట్టుకుందని రవికి అనుమానం ఉంది. అదే విషయంపై గంట ముందు ఉదయం 9.00 గంటలకు ఆమెతో గొడవ పడ్డాడు.

డెక్కన్ హెరాల్డ్ నివేదికల ప్రకారం, ఉదయం 10.15 గంటలకు గొడవ తీవ్రమైంది. రవి కొబ్బరికాయ కొడవలిని తీసుకొని భార్యపై దాడికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న సునీత తల్లి సరోజమ్మ(60) కూతురిని రక్షించేందుకు ముందుకు వచ్చింది. కొడవలి ఆమె తలకు తగిలి నేలపై కుప్పకూలింది. తన తల్లిపై జరిగిన దాడిపై కోపోద్రిక్తులైన సునీత, కుమార్‌పై అరవడం ప్రారంభించడంతో ఇది అతనికి మరింత కోపం తెప్పించింది. అదే కత్తితో వారిపై దాడి చేస్తూనే ఉన్నాడు.. చనిపోయే వరకు ఇద్దరు మహిళలను నరుకుతూనే ఉన్నాడు. రక్తంతో తడిసిన బట్టలతో కుమార్ ఉదయం 10.45 గంటలకు చంద్రా లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లాడు. సబ్‌ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌ని కలుసుకుని తన ఇంటి తాళాన్ని టేబుల్‌పై ఉంచి తాను చేసిన హత్యలను ఒప్పుకున్నాడు.

సంఘటన గురించి తెలుసుకున్న సబ్-ఇన్‌స్పెక్టర్, తన సీనియర్లకు సమాచారం అందించి కుమార్ ఇంటికి చేరుకున్నాడు. రవి ఇంట్లోకి రాగానే అతడు నిజమే చెప్పాడని క్లారిటీ వచ్చింది. శివమొగ్గకు చెందిన రవికి 18 ఏళ్ల క్రితం సునీతతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు.. 17 ఏళ్ల కుమారుడు, ఎనిమిదేళ్ల కుమార్తె ఉన్నారు. అతను కొబ్బరికాయలు అమ్మేవాడు, కానీ ఇటీవల బేకరీలో పని చేయడం ప్రారంభించాడు. తాము నివసించే ప్రాంతంలోని కొంతమంది వ్యక్తులతో సునీత అక్రమ సంబంధం పెట్టుకుందని కుమార్ అనుమానించాడు. గత ఆరు నెలలుగా ఇరు కుటుంబాల పెద్దలు సమస్యను పరిష్కరించినప్పటికీ శాంతించలేదు. దీనిపై తదుపరి విచారణలు కొనసాగుతున్నాయి.

Next Story