కుర్చీకి కట్టేసి చిత్ర హింసలు.. ఉరేసి భార్యను చంపిన భర్త

ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడని పోలీసులు అరెస్ట్ చేశారు.

By Srikanth Gundamalla  Published on  29 Aug 2024 9:30 AM IST
bangalore, husband, kill,  wife,  arrest,

కుర్చీకి కట్టేసి చిత్ర హింసలు.. ఉరేసి భార్యను చంపిన భర్త 

బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వివరాలను పోలీసులు బుధవారం మీడియాకు వెళ్లడించారు. సదురు మహిళ తన ఫ్లాట్‌లో అంతకుముందు రోజు తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉంది. ఆ తర్వాత రోజు ఉరేసుకుని చనిపోయి కనిపించింది. అయితే.. భర్తే హత్య చేశాడని ఆమె స్నేహితులు, బంధువులు అంటున్నారు. ఈ మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

కెంగేరి ఎస్‌ఎంవీ లేఅవుట్‌లో నవశ్రీ అనే 25 ఏళ్ల మహిళ తనభర్తతో కలిసి నివసిస్తోంది. వీరి పెళ్లి జరిగి మూడేళ్లు అవుతోంది. అప్పటి నుంచి తరచూ వీరి మధ్య గొడవలు జరుగుతుండేవని స్నేహితులకు నవ్యశ్రీ చెప్పింది. ఈ మేరకు ఆగస్టు 27వ తేదీన ఉదయం నవ్యశ్రీ నుంచి తన స్నేహితురాలు ఐశ్వర్యకు కాల్‌ చేసింది. తను చాలా బాధలో ఉన్నానని కలవాలని నవ్యశ్రీ మెసేజ్‌ పెట్టిందని ఐశ్వర్య చెప్పింది. ఈ మేరకు సాయంత్రం 4.30 గంటలకు నవ్యశ్రీ ఇంటికి ఐశ్వర్య ఇంటికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన అనిల్‌కు కాల్‌ చేశారు. అతనితో కూడా తన భద్రతపై భయాన్ని వ్యక్తం చేసింది నవ్యశ్రీ. అదేరోజు సాయంత్రం ముగ్గురూ కలిశారు. ఈ నేపథ్యంలో భర్త నుంచి థ్రెట్ ఉందని భావించిన నవ్యశ్రీని పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు స్నేహితులు.

ఆ తర్వాత అనిల్‌ను డ్రాప్‌ చేసి నవ్యశ్రీ, ఐశ్వర్య రాత్రి 11.30 గంటల సమయంలో ఇంటికి వచ్చి పడుకున్నారు. మద్యం సేవించిన ఐశ్వర్య ఆ తర్వాత రోజు ఉదయం లేచి చూడగా.. నవ్య శ్రీ శవమై కనిపించింది. వెంటనే ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇవ్వడంతో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు చెప్పారు. భార్యపై అనుమానం ఉన్న నవ్యశ్రీ భర్త కిరణ్‌ స్పేర్ తాళం వినియోగించి.. రాత్రి ఇంట్లోకి ప్రవేశించి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు.. మహిళను కూర్చీలో కూర్చోబెట్టి చిత్ర హింసలకు గురి చేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నారు. చిత్రహింసలు పెట్టిన తర్వాత ఆమెను హత్య చేసినట్లు చెబుతున్నారు. కాగా.. ఐశ్వర్య ఫిర్యాదుతో కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story