నవీన్‌ హత్య కేసు: ఏ3 నిందితురాలు నిహారికకు బెయిల్‌

తెలంగాణలో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో హరిహరకృష్ణ ప్రియురాలు నిహారికకు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్

By అంజి  Published on  19 March 2023 7:16 AM GMT
Naveen murder case, Telangana news

నవీన్‌ హత్య కేసు: ఏ3 నిందితురాలు నిహారికకు బెయిల్‌

తెలంగాణలో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో హరిహరకృష్ణ ప్రియురాలు నిహారికకు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిహారికి చర్లపల్లి జైలు నుంచి విడుదలైంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో ఏ1 హరిహర కృష్ణ, ఏ2 హరి ఫ్రెండ్ హసన్, ఏ3 నిహారికపై పోలీసులు కేసు నమోదు చేశారు. హసన్, నిహారికపై ఫోన్‌లో సమాచారం డిలీట్ చేయడంతో పాటు తమకు సమాచారం ఇవ్వకపోవడంపై పోలీసులు కేసు నమోదు చేసి నవీన్ హత్యలో వారిద్దరి పాత్రపై ఆరా తీసినట్లు సమాచారం.

ఈ సందర్భంగా నిహారిక, హసన్ హత్య గురించి తమకు తెలిసిన వివరాలను తెలిపారు. కొన్ని రోజులుగా పోలీసుల విచారణలో నిహారిక మౌనంగా ఉండి, పోలీసులు విచారిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఈ క్రమంలో నిహారికను పోలీసులు సఖి సెంటర్ కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత నిహారికను అదుపులోకి తీసుకుని విచారించగా అక్కడ నిహారిక హరికి రూ.1500 ఇచ్చిందని, నిహారిక కోసం హరిహరకృష్ణ నవీన్‌ను హత్య చేసినట్లు తేలింది. నిహారికను నవీన్ కొంతకాలంగా వేధిస్తున్నాడని, తానే హత్య చేశానని హరి ఒప్పుకున్నాడు.

Advertisement

హత్యకు పక్కా ప్లాన్‌

ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఇంటర్‌ స్నేహితుల గెట్‌ టు గెదర్‌ పార్టీ ఉన్నదని చెప్పి నవీన్‌ను హరిహరకృష్ణ హైదరాబాద్‌కు రప్పించాడు. ఆ తర్వాత ఇద్ద‌రు నగరంలో కాసేపు షికార్లు కొట్టారు. హరిహరకృష్ణ పెద్దఅంబర్‌పేట వద్ద మద్యం తీసుకొని అబ్దుల్లాపూర్‌మెట్‌ శివారులో నిర్మానుష్య ప్రాంతానికి నవీన్‌ని తీసుకువెళ్లాడు. మద్యం సేవించిన తర్వాత నిహారిక విష‌యంలో గొడ‌వ ప‌డ్డారు. పక్కా ప్లాన్‌ ప్రకారం.. క‌త్తితో న‌వీన్ పై విచ‌క్ష‌ణారహితంగా దాడి చేశాడు. తేరుకునేలోపే గొంతు నులిమి హ‌త‌మార్చాడు. వెంట తెచ్చుకున్న క‌త్తితో న‌వీన్ తల, మొండెం వేరు చేశాడు. చేతివేళ్లు కోసేశాడు. ఛాతిని చీల్చాడు. మ‌ర్మాంగాల‌ను కోసేశాడు. తన ఫోన్‌లో ఫోటోలు తీసి ప్రేయసికి వాట్సాప్‌కు పంపాడు.

Next Story
Share it