మైనర్ బాలికపై దారుణానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్లు

Auto drivers arrested for gang raping minor in deserted area.ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లాలో 16 ఏళ్ల మైనర్ బాలికపై

By M.S.R  Published on  14 Dec 2021 6:44 AM GMT
మైనర్ బాలికపై దారుణానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్లు

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లాలో 16 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆటోడ్రైవర్లు జావేద్, రెహమాన్ అలీలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణ సంఘటన డిసెంబర్ 10న చోటు చేసుకుంది. మైనర్ బాలిక ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలిక శుక్రవారం ఇంటి నుంచి బయలుదేరి.. ఆటో ఎక్కింది. అప్పటికే ఆ ఆటోలో నిందితులిద్దరూ కూర్చున్నారు. ఆటోలో ఒంటరిగా కూర్చున్న బాలికను చూసిన నిందితులు ఆమెను అక్కడి నుండి తీసుకెళ్లడం మొదలు పెట్టారు. వేరే రూట్ లో వెళుతూ.. ఆటోలోని ఇతరులను దింపేసి వచ్చారు. ఇక ఆటోలో బాలిక మాత్రమే ఉండగా నిందితులు కమల్ విహార్‌కు తీసుకెళ్లారు. అక్కడ నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఆమెను వేధించడం మొదలుపెట్టారు. బాధితురాలు అడ్డుకోడానికి ప్రయత్నించగా, ఆమెను చంపేస్తానని బెదిరించి సమీపంలోని ఖాళీ ప్లాట్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశారు.

అత్యాచారం చేసిన అనంతరం నిందితులు మైనర్‌ను నిర్జన ప్రాంతంలో వదిలి పారిపోయారు. బాధితురాలు అక్కడికి 3 కి.మీ దూరంలో ఉన్న తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకోగానే తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్నంతా చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఫిర్యాదు మేరకు నిందితుడి మొబైల్ నంబర్, ఆటోను పోలీసులు ట్రాక్ చేశారు. నిందితులపై సమాచారం అందిన వెంటనే పోలీసులు వారి ఇళ్లపై దాడి చేసి పట్టుకున్నారు. తమ ఇద్దరికీ బాధితురాలు ముందే తెలుసని నిందితులు చెప్పినట్లు రాయ్‌పూర్ పోలీస్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపారు. విచారణలో నిందితులు పోలీసుల ఎదుట తమ నేరాన్ని అంగీకరించారు. అత్యాచారం మరియు పోక్సో చట్టంతో సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులు జావేద్ మరియు రెహ్మాన్ అలీలను కోర్టులో హాజరుపరిచారు, అక్కడ వారిద్దరినీ జైలుకు పంపారు.

Next Story
Share it