నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం మినార్‌పల్లి గ్రామంలో మరో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య కిరాతకంగా హత్య చేసింది. భర్త దేశ్య నాయక్ (57) మద్యానికి బానిసై ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతున్నారు. దీనిపై పలుమార్లు ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, శుక్రవారం కూడా వివాదం తలెత్తింది. దీంతో కత్తితో భర్తపై దాడి చేసి గొంతులో పొడిచింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. నారాయణపేట జిల్లా కోటకొండకు చెందిన అంజిలప్ప (32) తన భార్య రాధ చేతిలో హత్యకు గురైన విషయం తాజాగా పోలీసుల విచారణలో బయటపడింది. రాధకు ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అతడితో ఆమె ఫోన్ మాట్లాడుతుండటం చూసి భర్త మందలించాడు. ఈ క్రమంలోనే గత నెల 23న మద్యం మత్తులో ఉన్న భర్తను భార్య గొంతు నులిమి చంపినట్టు విచారణలో తేలింది.