అసద్‌ను ఎన్ కౌంటర్ చేసిన యూపీ పోలీసులు
ఉత్తర ప్రదేశ్‌లో లోక్‌సభ మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ అతిఖ్ అహ్మద్ కొడుకు అసద్‌ను యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.
By M.S.R Published on 13 April 2023 3:00 PM GMTఅసద్‌ను ఎన్ కౌంటర్ చేసిన యూపీ పోలీసులు
ఉత్తర ప్రదేశ్‌లో లోక్‌సభ మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ అతిఖ్ అహ్మద్ కొడుకు అసద్‌ను యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. అహ్మద్‌ను ఝాన్సీ వద్ద పోలీసులు కాల్చి చంపారు. గురువారం అతిఖ్‌ను కోర్టులో ప్రవేశపెట్టే సమయంలోనే ఈ ఎన్‌కౌంటర్ వార్త బయటకు వచ్చింది. అసద్‌తో పాటు మరో నిందితుడు గుల్హామ్ కూడా ఈ ఘటనలో హతమయ్యాడు. యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బలగాలు (ఎస్‌టీఎఫ్) ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నాయి. ఘటనా స్థలిలో అత్యాధునిక విదేశీ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఎన్ కౌంటర్ పై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. యూపీ ఎస్టీఎఫ్‌పై ప్రశంసలు కురిపించారు. హోం ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ ప్రసాద్ ఈ ఎన్‌కౌంటర్ విషయాన్ని సీఎంకు సమాచారం అందించారు. ఈ ఎన్‌కౌంటర్ తర్వాత శాంతిభద్రతలకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేశారు. ఉమేష్ పాల్ హత్య కేసు తరువాత అసద్ అహ్మద్ పరారీలో ఉన్నారు. ఫిబ్రవరి 24న ప్రయాగ్‌రాజ్ లో జరిగిన ఉమేష్ పాల్ హత్యలో అసద్ అహ్మద్, గులామ్‌లు వాంటెడ్ క్రిమినల్స్ గా ఉన్నారు. ఆ కేసులో అసద్‌పై 5 లక్షల రివార్డు ఉంది. తాజాగా జరిగిన పోలీసుల కాల్పుల్లో ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం వారిని కాల్చి చంపింది. వారి నుంచి అధునాతన ఆయుధాలు, సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఝాన్సీలోని బడా గావ్, చిర్గావ్ పోలీస్ స్టేషన్ మధ్య ఈ ఎన్కౌంటర్ జరిగింది.