అక్కాచెల్లెళ్లపై అత్యాచారం..అవమానంతో ఇద్దరూ ఆత్మహత్య
అస్సాంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లపై కొందరు దుండుగులు అత్యాచారానికి పాల్పడ్డారు.
By Srikanth Gundamalla Published on 7 Aug 2023 10:37 AM ISTఅక్కాచెల్లెళ్లపై అత్యాచారం..అవమానంతో ఇద్దరూ ఆత్మహత్య
అస్సాంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లపై కొందరు దుండుగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అవమాన భారంతో అక్కాచెల్లెళ్లు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
కామరూప్ జిల్లాలోని తులసిబారి ప్రాంతంలో.. ఓ చెట్టుకు వేలాడుతున్న ఇద్దరు యువతుల మృతదేహాలను స్థానికులు గుర్తించారు. ఆ తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో.. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను కిందకు దించి మార్చురీకి తరలించారు. అయితే.. ఇద్దరు యువతులు వరుసకు అక్కాచెల్లెళ్లు అవుతారని పోలీసులు తెలిపారు. ఇద్దరి వయసు 17, 19 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారం చేశారని స్థానికులు చెబుతున్నారు.
అత్యాచారానికి గురి కావడంతో అవమాన భారంగా భావించారని స్థానికులు చెబుతున్నారు. అందుకే అడవిలో నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు. ఈ సంఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. స్థానికుల సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అయితే.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించామని.. నివేదిక వచ్చాక అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు పోలీసులు. పూర్తి విచారణ తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు. కాగా.. ఇద్దరు అక్కాచెల్లెళ్లు అడవి ప్రాంతంలోకి వెళ్లి ఉరివేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వారిపై అత్యాచారం జరిగిందన్న వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిందితులు ఎవరనే దానిపై స్థానికులు చర్చించుకుంటున్నారు