బాత్ రూమ్ కిటికీ నుండి దూకేసిన 13 ఏళ్ల బాలుడు.. ఇంత చిన్న కారణానికా..?

మహారాష్ట్రలోని భయాందర్‌లో 13 ఏళ్ల బాలుడు 16వ అంతస్తులోని అపార్ట్‌మెంట్‌లోని బాత్రూమ్ కిటికీ నుండి దూకి ప్రాణాలు

By M.S.R  Published on  6 April 2023 5:30 PM IST
Maharashtra, teenage boy, Suicide

బాత్ రూమ్ కిటికీ నుండి దూకేసిన 13 ఏళ్ల బాలుడు.. ఇంత చిన్న కారణానికా..?

మహారాష్ట్రలోని భయాందర్‌లో 13 ఏళ్ల బాలుడు 16వ అంతస్తులోని అపార్ట్‌మెంట్‌లోని బాత్రూమ్ కిటికీ నుండి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. తన జుట్టును చాలా చిన్నగా కత్తిరించినందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. నవ్‌ఘర్ పోలీసులు ప్రమాదవశాత్తు మరణ నివేదికను నమోదు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు.

థానే జిల్లాలోని భయాందర్‌ నగరానికి చెందిన ‌13 ఏళ్ల బాలుడికి కుటుంబ సభ్యులు హెయిర్‌ కట్‌ చేయించారు. జుట్టు చాలా చిన్నగా కత్తిరించడంపై అతడు బాధపడ్డాడు. అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌ 16వ అంతస్తులోని బాత్‌రూమ్‌ కిటికీ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడు అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న నవఘర్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story