'నువ్వే నమ్మకుంటే ఎవరు నమ్ముతారు నాన్న'.. యువతి సూసైడ్ నోట్

ఓ యువతి రాసిన సూసైడ్ లెటర్‌ అందరి మనసును కలచి వేస్తుంది.

By Srikanth Gundamalla  Published on  6 Aug 2024 3:31 AM GMT
Andhra Pradesh, engineering student, suicide letter,

'నువ్వే నమ్మకుంటే ఎవరు నమ్ముతారు నాన్న'.. యువతి సూసైడ్ నోట్

ఓ యువతి రాసిన సూసైడ్ లెటర్‌ అందరి మనసును కలచి వేస్తుంది. తాను ఓ యువకుడితో సన్నిహితంగా ఉండటంపై తండ్రి మందలించాడు. అన్నగా బావించి మంచిగా మెలిగినా తప్పుగా అర్థం చేసుకున్నందుకు యువతి మనోవేదనకు గురైంది. నువ్వు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు నాన్న అంటూ సూసైడ్‌ లెటర్ రాసి ప్రాణాలను తీసుకుంది.

నంద్యాల జిల్లా డోన్‌ పట్టణంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. జక్కి గౌరప్ప, రామేశ్వరి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. వీరిలో పెద్ద కూతురు రేణుక (22) ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతోంది. వేసవి సెలవులు ముగించుకుని ఇటీవలే ఆమె కాలేజ్‌కు వెళ్లింది. స్థానికంగా కళాశాల హాస్టల్‌లోనే తన స్నేహితులతో కలిసి ఉండేది. ఆదివారం సాయంత్రం రేణుకను చెల్లిగా చేసుకునే యువకుడు ఆమెతో పాటు ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థి ఫోన్ చేశాడు. పనిలో ఉండి ఆమె దాన్ని పట్టించుకోలేదు. దాంతో.. ఆ విదయార్థి ఆమె తండ్రి గౌరప్పకు ఫోన్ చేసి ఆమె ఫోన్ తీయడం లేదని చెప్పాడు. దాంతో.. ఆగ్రహానికి గురైన తండ్రి కూతురికి ఫోన్ చేసి గట్టిగా మందలించాడు. అబ్బాయిలతో పనేంటని.. అతనెందుకు కాల్ చేస్తున్నాడంటూ నిలదీశాడు. ఈ విషయాన్ని కాలేజ్‌లోనే తేలుస్తానంటూ మండిపడ్డాడు. రేణుక అలాంటిదేమీ లేదని చెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. ఆ తర్వాత రోజు తండ్రి కాలేజీకి వస్తానని చెప్పడంతో భయపడిపోయింది రేణుక.

తండ్రి వస్తే పరిణామాలు ఎలా మారుతాయో అంటూ భయాందోళనకు గురైంది రేణుక. తాను ఏ తప్పూ చేయలేదనీ.. ఉత్తరం రాసింది. హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం వచ్చిన తల్లిదండ్రులు ఆమె కోసం అడిగారు. ఇక ఆమె స్నేహితులు గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటాన్ని తల్లిదండ్రులు, హాస్టల్ సిబ్బందికి చెప్పారు. కూతురు సూసైడ్ చేసుకోవడాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్లి.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.


Next Story