దారుణం.. బిర్యానీ డబ్బుల కోసం అన్నను చంపిన తమ్ముడు

చిన్న చిన్న విషయాలకే గొడపడుతుంటారు కొందరు.

By Srikanth Gundamalla  Published on  27 Aug 2024 9:58 AM IST
Andhra Pradesh, brother, kill, elder brother,  biryani money

దారుణం.. బిర్యానీ డబ్బుల కోసం అన్నను చంపిన తమ్ముడు

చిన్న చిన్న విషయాలకే గొడపడుతుంటారు కొందరు. అయితే.. క్షణికావేశంలో ఘోరాలు జరిగిపోతుంటాయి. చిన్న విషయంలో గొడవపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఓ వ్యక్తి కేవలం బిర్యానీ డబ్బులు ఇవ్వలేదని సొంత అన్నను చంపేశాడు. ఈ సంఘటన భవానీపురం పరిధిలోని గొల్లపూడి సాయిపురం కాలనీలో జరిగింది.

గొల్లపూడి సాయిపురం కాలనీలో గాలి తమ్మయ్య అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు. రాము (36), సూర్రెడ్డి, లక్ష్మారెడ్డి ముగ్గురు కొడుకులు. అయితే.. రాము ఇంటికి గత ఆదివారం లక్ష్మారెడ్డి వెళ్లాడు. తన భార్య రొయ్యల బిర్యానీ తీసుకురావాలని చెప్పింది. అయితే.. తన దగ్గర డబ్బులు లేవనీ.. రామును ఇవ్వాలని లక్ష్మారెడ్డి కోరాడు. రాము వద్ద డబ్బులు లేవని చెప్పాడు. దాంతో.. డబ్బులు ఉంచుకునే ఇవ్వడం లేదనీ.. ఎందుకు ఇవ్వవు అంటూ గొడవ పెట్టుకున్నాడు లక్ష్మారెడ్డి. వాగ్వాదానికి దిగారు ఇద్దరూ. అయితే..ఈ గొడవ చినికి చినికి గాలి వాన అయ్యింది. రాముపై లక్ష్మారెడ్డి చేయి చేసుకున్నాడు. చెంప దెబ్బ కొట్టడం ఘర్షణ మొదలైంది. లక్ష్మారెడ్డి కిటికీ చెక్కతో రాము తలపై బలంగా కొట్టాడు. దాంతో.. రాము ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఓ పక్క రాము భార్య అడ్డుకున్నా.. లక్ష్మారెడ్డి కొడుతూనే ఉన్నాడు. దాంతో.. అక్కడే రాము ప్రాణాలు కోల్పోయాడు. చివరకు ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నాడు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నిందితుడు లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు పోలీసులు .

Next Story