కారుతో సహా కొండ లోయలోకి దూసుకెళ్లి.. స్కూల్ కరస్పాండెంట్ ఆత్మహత్య.. వీడియో వైరల్

అనంతపురం జిల్లాలో సోమవారం జరిగిన ఓ ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ (56) మృతిపై మిస్టరీ వీడింది.

By అంజి  Published on  18 April 2023 9:00 AM IST
Anantapuram, school correspondent , suicide

కారుతో సహా కొండ లోయలోకి దూసుకెళ్లి.. స్కూల్ కరస్పాండెంట్ ఆత్మహత్య.. వీడియో వైరల్

అనంతపురం జిల్లాలో సోమవారం జరిగిన ఓ ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ (56) మృతిపై మిస్టరీ వీడింది. పీ ఉమాపతిగా గుర్తించిన అతడు బుక్కరాయసముద్రం మండల పరిధిలోని కొండ లోయలోకి తన కారును నడుపుకుంటూ వెళ్లి ప్రాణాలు విడిచాడు. ఉమాపతి సోమవారం ఉదయం బుక్కరాయసముద్రం మండల కేంద్రానికి సమీపంలోని దేవునికొండ గుట్ట వద్దకు చిన్న గుడిలో పూజలు చేసి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఆ తర్వాత తన డ్రైవర్‌ను కారు నుంచి దించేసి.. ఆయనే స్వయంగా కారు నడుపుతూ కొండ కిందికి దూసుకెళ్లారు.

వాహనాన్ని ఆపమని డ్రైవర్ కేకలు వేయమన్న వినలేదు. ఉమాపతి కారు స్టార్ట్ చేసి 75 అడుగుల లోతున్న కొండ లోయలోకి దూసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. తీవ్ర గాయాలపాలైన ఉమాపతి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఉమాపతి చాలా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారని, అందుకే ఉమాపతి ఈ దారుణానికి ఒడిగట్టారని స్థానికులు తెలిపారు.

ఆత్మహత్యాయత్నాన్ని వీడియో ఎందుకు తీశారంటూ డ్రైవర్‌ పాత్రపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని బుక్కరాయసముద్రం పోలీసులు తెలిపారు. ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. బాధితురాలి మొబైల్ ఫోన్‌లో ఎలాంటి ఆధారాలు ఉన్నాయో లేదో పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

- ఎవరైనా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు లేదా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మీకు తెలిస్తే, దయచేసి సహాయం అందించండి. వ్యక్తులు, కుటుంబాలకు భావోద్వేగ మద్దతును అందించే ఆత్మహత్య-నివారణ సంస్థల యొక్క కొన్ని హెల్ప్‌లైన్ నంబర్‌లు ఇక్కడ ఉన్నాయి. కాల్- 9152987821, AASRA-9820466726, రోష్ని ట్రస్ట్- 040-66202000.

Next Story