అపార్ట్‌మెంట్ సమీపంలో ఎయిర్ హోస్టెస్ మృతదేహం.. ప్రియుడు అరెస్ట్

బెంగళూరు పోలీసులు ఎత్తైన భవనం సమీపంలో 28 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ శవమై కనిపించడంతో ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.

By అంజి  Published on  14 March 2023 2:03 AM GMT
Air hostess,  Bengaluru

అపార్ట్‌మెంట్ సమీపంలో ఎయిర్ హోస్టెస్ మృతదేహం.. ప్రియుడు అరెస్ట్

బెంగళూరు పోలీసులు శనివారం కోరమంగళలోని ఎత్తైన భవనం సమీపంలో 28 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ శవమై కనిపించడంతో ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఓ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్ కంపెనీలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తూ ఇటీవలే తన ప్రియుడిని కలవడానికి దుబాయ్ నుంచి వచ్చింది. బాధితురాలితో తనకు సంబంధం ఉందని, తరచూ గొడవలు జరిగేవని నిందితుడు పోలీసులకు తెలిపాడు. తమకు గొడవ జరిగిందని, ఆ తర్వాత మహిళ భవనంపై నుంచి పడి చనిపోయిందని పోలీసులకు చెప్పాడు.

హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఎయిర్ హోస్టెస్, ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తన ప్రియుడిని కలవడానికి వచ్చింది. నిందితుడు కేరళ వాసి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 12 గంటల సమయంలో బాధితురాలు అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తు నుంచి పడిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయమై ప్రాథమిక విచారణలో జంట మధ్య వాగ్వాదం జరిగినట్లు తేలిందని, ఆ తర్వాత మహిళ ఎత్తుపై నుంచి కిందపడిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఆమె ప్రియుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మహిళ ప్రియుడే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ జంట డేటింగ్ అప్లికేషన్‌ ద్వారా కలుసుకున్నారని, గత ఆరు నెలలుగా ప్రేమలో ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే ఇటీవల తరచూ తగాదాల కారణంగా తమ రిలేషన్‌షిప్‌లో కలహాలు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. శుక్రవారం రాత్రి సినిమా చూసేందుకు వెళ్లి తిరిగి ఇంటికి రాగానే జంట గొడవ పడ్డారు. జంట విడిపోవాలని నిర్ణయించుకోవడంతో.. ఆ మహిళ తన ప్రియుడిని కలిసేందుకు బెంగళూరు వచ్చిందని పోలీసు వర్గాలు తెలిపాయి.

తొలుత ఆత్మహత్యగా కేసు నమోదు చేశామని.. ఆ తర్వాత భవనం నాలుగో అంతస్తు నుంచి దూకడం అంత తేలిక కాదని హత్య కేసు నమోదు చేశామని, నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడని, కేసు దర్యాప్తు చేస్తున్నామని సౌత్ డీసీపీ సీకే బాబా తెలిపారు. బాధితురాలు మద్యం తాగలేదని తెలిపారు.

Next Story