మద్యం తాగొద్దన్న‌ భార్య.. భర్త ఏ నిర్ణయం తీసుకున్నాడంటే

Acid thrown at wife for refusing to drink alcohol.బీహార్‌లోని బక్సర్ జిల్లాలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది.

By M.S.R  Published on  20 Jan 2022 8:36 AM GMT
మద్యం తాగొద్దన్న‌ భార్య.. భర్త ఏ నిర్ణయం తీసుకున్నాడంటే

బీహార్‌లోని బక్సర్ జిల్లాలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగవద్దన్న భర్తపై యాసిడ్ పోశాడు ఓ భర్త. యాసిడ్‌ దాడిలో తీవ్రంగా కాలిపోయిన భార్యకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. బ్రహ్మపూర్ బ్లాక్‌ డేరాలో చోటు చేసుకుంది. జగ్నారాయణ ఎక్కువగా మద్యం సేవించేవాడని, ఈ అలవాటు కారణంగా భార్య సవితతో తరచూ గొడవలు పడేవాడని సమాచారం. మొగుడితో గొడవలు పడలేక సవిత తన తల్లి ఇంట్లో ఉంది. జగ్నారాయణ తనను కలవడానికి వచ్చి.. తనపై అకస్మాత్తుగా యాసిడ్ దాడి చేశాడని, దీంతో తాను తీవ్రంగా కాలిపోయానని సవిత చెప్పింది. కుటుంబీకులు గాయపడిన సవితను సదర్ ఆసుపత్రికి తరలించారు.

2016లో నైనిజోర్ నివాసి జగ్నారాయణతో వివాహం జరిగింది. అతడు మద్యానికి బానిసయ్యాడు. దీని గురించి సవితతో జగ్నారాయణ ప్రతిరోజూ గొడవపడేవాడని తేలింది. దీంతో సవిత పుట్టింటికి వెళ్ళిపోయింది. భార్యను తిరిగి పంపమని జగ్నారాయణ నిరంతరం అత్తగారికుటుంబంపై ఒత్తిడి చేస్తున్నాడు. సోదరి సవిత వెళ్లేందుకు నిరాకరించి మద్యం మానేస్తే కలిసి వెళ్తామని చెప్పింది. ఇదే విషయం నచ్చక జగ్నారాయణ రాత్రి యాసిడ్‌తో అక్కడికి చేరుకుని భార్యపై యాసిడ్‌ పోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. జగ్నారాయణని పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story
Share it