హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. బోరబండ ప్రాంతంలో యువతి హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తనతో సరిగా మాట్లాడటం లేదన్న అనుమానంతో ఓ యువకుడు యువతిని హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌లో పనిచేస్తున్న యువతికి, గతంలో అదే పబ్‌లో నిందితుడి జహీర్‌తో పరిచయం ఏర్పడింది. ఇటీవల ఆమె ఊర్వశీ బార్‌కు షిఫ్ట్ కావడంతో, అప్పటి నుంచి తనతో మాట్లాడటం తగ్గించిందని నిందితుడు జహీర్ అనుమానం పెంచుకున్నాడు.
ఈ క్రమంలోనే 'మాట్లాడుకుందాం.. రా' అంటూ బోరబండ ప్రాంతానికి పిలిచాడు. ఆ తరువాత ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పెద్ద ఎత్తున గొడవ జరగడంతో ఆగ్రహానికి లోనైనా నిందితుడు ఒక్కసారిగా యువతి పై దాడి చేసి హత్య చేశాడు. మృతదేహాన్ని ఓ ఇంటి పక్కన పడేశాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.