మహబూబాబాద్‌లో సామూహిక అత్యాచారం.. గర్భందాల్చిన 13 ఏళ్ల బాలిక

A 13-year-old girl was gang-raped in Mahabubabad. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మైనర్లతో సహా ముగ్గురు వ్యక్తులు

By అంజి
Published on : 24 Aug 2022 1:18 PM IST

మహబూబాబాద్‌లో సామూహిక అత్యాచారం.. గర్భందాల్చిన 13 ఏళ్ల బాలిక

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మైనర్లతో సహా ముగ్గురు వ్యక్తులు 13 ఏళ్ల బాలికపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న బాధితురాలు కొన్ని నెలల క్రితం పలుమార్లు సామూహిక అత్యాచారానికి గురైంది. అయితే ఈ విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఆమెను సోమవారం రాత్రి తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది.

మైనర్ ఆరు నెలల గర్భవతి అని వైద్యులు తెలిపారు. దీంతో ఆ మైనర్‌ని ప్రశ్నించగా గ్రామంలోని ముగ్గురు వ్యక్తులు తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని తల్లిదండ్రులకు వెల్లడించింది. అనంతరం బాధిత కుటుంబీకులు నెల్లికుదురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తొర్రూరు డీఎస్పీ రఘుబాబు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Next Story