9 ఏళ్ల పిల్లాడు మొబైల్ లో గేమ్ ఆడుతూ ఉండగా..!

9 Year old boy was playing game on mobile phone exploded.ఈకాలంలో చిన్న పిల్లలకు ఎప్పుడు చూసినా

By M.S.R  Published on  16 Nov 2021 12:45 PM GMT
9 ఏళ్ల పిల్లాడు మొబైల్ లో గేమ్ ఆడుతూ ఉండగా..!

ఈకాలంలో చిన్న పిల్లలకు ఎప్పుడు చూసినా మొబైల్ ఫోన్స్ లో ఆటలే..! బయటకు వెళ్లి ఆడుకోవడం చాలా వరకూ మానేశారు. కుటుంబ సభ్యులు ఫోన్ ఇవ్వకపోతే అన్నం కూడా తినని పిల్లలు ఉన్నారు. ఇక కొంచెం వయసు వచ్చాక అందులో గేమ్స్ ఆడుతూ ఉంటారు. అదే పిచ్చి తీవ్ర ఇబ్బందులకు దారి తీసే అవకాశం ఉంది.

ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లాలో 9 ఏళ్ల బాలుడు మొబైల్ గేమ్ ఆడుతూ ఉన్న సమయంలో అది పేలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. చిన్నారి ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ బిజీగా ఉన్న సమయంలో ఫోన్ పేలడంతో ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయి. ఘటన అనంతరం చిన్నారిని చికిత్స నిమిత్తం నవాగర్‌లోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ కేసు జంజ్‌గిర్ చంపా జిల్లాలోని నవల్‌ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోధ్నా గ్రామంలో చోటు చేసుకుంది.

గోధ్నా నివాసి మోహన్‌ కుర్రే కుమారుడు శివశంకర్‌ కుర్రె మొబైల్‌లో గేమ్‌లు ఆడేందుకు అలవాటు పడ్డాడు. రోజూ మొబైల్‌లో గేమ్స్‌ ఆడేవాడు. గత ఆదివారం కూడా ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా మొబైల్ పేలింది. వెంటనే చిన్నారిని చికిత్స నిమిత్తం నవగర్‌లోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అతను అక్కడే చికిత్స పొందుతున్నాడు. బాలుడి ఛాతీకి బలమైన గాయమైందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. శివ రోజూ సుమారు 2 గంటల పాటు మొబైల్‌లో గేమ్స్‌ ఆడేవాడని చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపారు.

Next Story