సిలిండ‌ర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన 9మంది మృతి

9 MP Workers died due to Cylinder explosion in Ahmedabad.గుజ‌రాత్ రాష్ట్రంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 July 2021 9:13 AM GMT
సిలిండ‌ర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన 9మంది మృతి

గుజ‌రాత్ రాష్ట్రంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. సిలిండ‌ర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన 9 మంది కూలీలు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న అహ్మ‌దాబాద్ లో జ‌రిగింది. వీరందరినీ మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు.

వివ‌రాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్​ వచ్చిన కూలీలు స్థానికంగా ఉన్న ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. వీరంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే శుక్రవారం రాత్రి ఇంట్లోని సిలిండ‌ర్ పేలింది. ఈ ఘ‌ట‌న‌లో 7గురు అక్క‌డిక్క‌డే మృతి చెంద‌గా.. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప్ర‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ మ‌రో ఇద్ద‌రు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 9కి చేరింది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

కాగా.. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివ్​​రాజ్​ సింగ్​ చౌహాన్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4లక్షలు పరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందిస్తామన్నారు.

Next Story
Share it