ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం, 12 మంది పరిస్థితి విషమం

9 dead in tourist bus-KSRTC crash in Kerala. కేరళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలపక్కడ్‌ జిల్లాలోని వడక్కంచేరి వద్ద టూరిస్ట్‌ బస్సు కేరళ ఆర్టీసీ బస్సును

By అంజి  Published on  6 Oct 2022 7:42 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం, 12 మంది పరిస్థితి విషమం

కేరళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలపక్కడ్‌ జిల్లాలోని వడక్కంచేరి వద్ద టూరిస్ట్‌ బస్సు కేరళ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. గురువారం అర్ధరాత్రి ఎర్నాకులంలోని ములంతురుతిలోని బేసిలియస్ స్కూల్ నుండి విద్యార్థులను తీసుకెళ్తున్న టూరిస్ట్ బస్సు ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరో 36 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిసింది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది విద్యార్థులు, ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు.

కేరళ ఆర్టీసీ బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల్లో కేఎస్‌ఆర్టీసీ బస్సు ప్రయాణికుడు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. వలయార్ - వడక్కన్చేరి జాతీయ రహదారిపై అంజుమూర్తి మంగళం బస్టాప్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను పాలక్కాడ్ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. మృతుల మృతదేహాలు అలత్తూర్ మరియు పాలక్కాడ్ ఆసుపత్రులలో ఉన్నాయి.

బేసిలియస్ స్కూల్‌లోని 10, 11, 12 తరగతుల విద్యార్థులు విహారయాత్రకు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. కారును ఓవర్‌టేక్‌ చేస్తుండగా టూరిస్ట్‌ బస్సు అదుపు తప్పి కేఎస్‌ఆర్‌టీసీ బస్సును ఢీకొట్టింది. వర్షం కారణంగా ప్రమాద తీవ్రత పెరిగింది. కేఎస్‌ఆర్టీసీ బస్సు కొట్టారక్కరా నుండి కోయంబత్తూర్ వెళుతోంది. టూరిస్ట్ బస్సులో ఉన్న ప్రయాణికులను బస్సు అద్దాలు పగలగొట్టి బయటకు తీశారు. టూరిస్ట్ బస్సు ఓవర్ స్పీడ్ గా ఉందని కెఎస్‌ఆర్‌టిసి డ్రైవర్ సుమేష్ తెలిపారు . ఈ విషయాన్ని విద్యార్థులు కూడా సమర్థించారు. పోలీసులు, స్థానికుల సహకారంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story