దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం.. రక్తపు మరకలతో ఏడుస్తూ కనిపించింది
తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో శనివారం దారుణ ఘటన జరిగింది. తన ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారిపై...
By - అంజి |
దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం.. రక్తపు మరకలతో ఏడుస్తూ కనిపించింది
తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో శనివారం దారుణ ఘటన జరిగింది. తన ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారిపై మణికంఠన్ (24) అనే భవన నిర్మాణ కార్మికుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టి, అనంతరం ఒక వంతెన సమీపంలో వదిలేసి పరారయ్యాడు. రక్తపు మరకలతో ఏడుస్తున్న బాలికను గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారికి చికిత్స అందుతోంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అయితే, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
రాజకీయ రంగు పులుముకున్న ఘటన
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు (మే 2026 లోపు) జరగనున్న తరుణంలో ఈ ఘటన అధికార డీఎంకే (DMK) ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఇపిఎస్ స్పందిస్తూ.. స్టాలిన్ ప్రభుత్వంలో మహిళలకు, చిన్నారులకు రక్షణ కరువైందని విమర్శించారు. "పరిపాలనలో అవినీతి పెరిగిపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఏ మొహం పెట్టుకుని ప్రజలను మళ్ళీ ఓట్లు అడుగుతారు స్టాలిన్ గారు?" అంటూ ఆయన ప్రశ్నించారు.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ 'X' వేదికగా స్పందిస్తూ.. రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక చిన్నారిని కిడ్నాప్ చేసి అఘాయిత్యం చేసేంత ధైర్యం నేరగాళ్లకు వచ్చిందంటే చట్టం పట్ల భయం లేకపోవడమే కారణమని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో మహిళల భద్రత అనేది ప్రధాన ప్రచారాస్త్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.