ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లక్నో-గోరఖ్‌పూర్ హైవేపై ప్రయాణీకులతో వెళుతున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఏడుగురు ప్రయాణికులు మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడ్డారు. ట్రక్కును ఢీకొనడంతో బస్సు పక్కకు పడిపోయి, లోడ్ చేసిన గూడ్స్ క్యారియర్ కిందకు పడ్డాయని అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం అయోధ్య నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు అంబేద్కర్‌నగర్ వైపు వెళ్లేందుకు హైవేపై మలుపు తీసుకోవడానికి ప్రయత్నించే సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
"సుమారు 12 మందిని ఆసుపత్రికి తరలించాం. 5 మందిని జిల్లా ఆసుపత్రికి, 7 మందిని మెడికల్ కాలేజీకి పంపారు. ప్రాణనష్టం కూడా సంభవించింది. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది" అని అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్, నితీష్ కుమార్ నివేదించారు.
ఈ ఘటనపై సీఎం యోగి సంతాపం వ్యక్తం చేశారు. “అయోధ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం పట్ల యూపీ సీఎం యోగి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతి తెలిపారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి వారికి అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. సరైన చికిత్స అందించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు." అని CMO ట్వీట్ చేసింది.