ఐదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం..ఆత్మహత్య
ఓ వృద్ధుడు పశువులా ప్రవర్తించాడు. ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 7 Oct 2023 11:04 AM ISTఐదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం..ఆత్మహత్య
మహిళలపై రోజురోజు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడో ఒక చోట ప్రతి రోజు అత్యాచార సంఘటనలు వెలుగులు చూస్తున్నాయి. కొందరు కామాంధులు అయితే వయసును కూడా చూడటం లేదు. చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారు. తాజాగా ఓ వృద్ధుడు పశువులా ప్రవర్తించాడు. ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలి జిల్లా ఫరీద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఫరీద్‌పూర్ పీఎస్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలిక ఇంటి బయట ఆడుకుంటోంది. అయితే.. అక్కడే ఉన్న 60 ఏళ్ల వృద్ధుడు మహ్మద్ ఆ చిన్నారిపై కన్నేశాడు. చుట్టూ ఎవరూ లేకుండా గమనించి మాయమాటలు చెప్పి ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లాడు. ఆ తర్వాత చిన్నారి అని కూడా చూడకుండా పిశాచిలా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. చిన్నారి కోసం కుటుంబ సభ్యులు ఇంట్లో వేచి చూశారు. ఎంతకీ రాకపోవడంతో ఆందోళనకు గురై చుట్టుపక్కల వెతికారు. చివరకు ఆ వృద్ధుడి ఇంట్లోకి వెళ్లి చూడగా బాలిక రక్తస్రావం అయి నేలపై పడి ఉంది.
ఇక వెంటనే బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. కాగా.. అత్యాచారం తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. కొద్ద అతడి కోసం స్థానికులు వెతకగా ఊరి చివర ఒక చెట్టుకి ఉరివేసుకుని కనిపించాడు. అయితే.. ఈ దారుణ సంఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. అత్యాచారం తర్వాత భయంతోనే వృద్ధుడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. వృద్ధుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నట్లు ఫరీద్‌పూర్ పోలీసులు వెల్లడించారు.