విషాదం.. నైట్రోజన్‌ గ్యాస్ లీకేజీ‌.. ఆరుగురు మృతి

6 employees dead after liquid nitrogen leak at Gainesville poultry plant.నైట్రోజ‌న్ గ్యాస్ లీకైజీ అయి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మ‌రో 12 మంది తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jan 2021 5:19 AM GMT
విషాదం.. నైట్రోజన్‌ గ్యాస్ లీకేజీ‌.. ఆరుగురు మృతి

నైట్రోజ‌న్ గ్యాస్ లీకైజీ అయి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మ‌రో 12 మంది తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. దీంతో వెంట‌నే వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషాద ఘ‌ట‌న అమెరికాలోని ఈశాన్య జార్జియాలోని గైనెస్‌విల్‌లో జ‌రిగింది. అధికారులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. గురువారం ఉదయం 10 గంట‌ల స‌మ‌యంలో ప్రైమ్ పాక్ ఫుడ్స్ కర్మాగారంలో లిక్విడ్‌ నైట్రోజన్‌ గ్యాస్‌ లీకేజీ అయింది. వెంట‌నే అక్క‌డ ప‌నిచేస్తున్న వారు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. వారు వెంట‌నే అక్క‌డికి చేరుకుని లీకేజీని అరిక‌ట్టే క్ర‌మంలో.. వారు కూడా అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో వారిని వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ప్రమాదం జరిగిన తర్వాత సుమారు 130 మంది స్థానిక చర్చి వద్దకు తరలించి, వైద్య పరీక్షలు చేసినట్లు హాల్ కౌంటీ ఫైర్ డిపార్ట్మెంట్ చీఫ్ జాచ్ బ్రాకెట్ తెలిపారు. ఘ‌ట‌న జ‌రిగిన స్థ‌లంలోనే ఐదుగురు మృతి చెంద‌గా.. చికిత్స పొందుతూ మ‌రొక‌రు మృతి చెందిన‌ట్లు వెల్ల‌డించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మ‌రో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఈశాన్య జార్జియా మెడికల్ సెంటర్ ప్రతినిధి బెత్ డౌన్స్ తెలిపారు. ప్రమాదంపై ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేస్తోంది.




Next Story