విషాదం.. కుప్ప‌కూలిన నాలుగు అంత‌స్తుల భ‌వ‌నం.. 9 మంది మృతి

4 Storey building in Malvani collapses.మహారాష్ట్రలోని ముంబైలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఓ నాలుగు అంత‌స్తుల భ‌వ‌నం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jun 2021 1:43 AM GMT
విషాదం.. కుప్ప‌కూలిన నాలుగు అంత‌స్తుల భ‌వ‌నం.. 9 మంది మృతి

మహారాష్ట్రలోని ముంబైలో విషాదం చోటు చేసుకుంది. ఓ నాలుగు అంత‌స్తుల భ‌వ‌నం కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో 9మంది మృతి చెంద‌గా.. మ‌రో 8 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న మలాడ్‌ వెస్ట్‌ ప్రాంతంలోని న్యూకలెక్టర్‌ కాంపౌండ్‌లో బుధవారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో జ‌రిగింది. స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. శిథిలాల కింద మ‌హిళ‌లు, పిల్ల‌లు ఉన్నారు. స్థానికులు, పోలీసులు స‌హాయంతో విప‌త్తు సిబ్బంది శిథిలాల నుంచి 15 మందిని ర‌క్షించారు.

ప్రస్తుతం ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయ‌ప‌డిన వారిని బీడీబీఏ మున్సిప‌ల్ జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. సమీపంలో ఉన్న రెండు భవనాలు సైతం సరైన స్థితిలో లేనందున వాటిలో ఉంటున్న వారిని సైతం ఖాళీ చేయించి కూల్చివేసినట్లు బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి అస్లాం షేక్‌ మాట్లాడుతూ.. భారీగా కురిసిన వర్షం కారణంగా భవనం కూలిపోయిందన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, గాయపడిన వారిని ఆస్ప‌త్రిలో చేర్పించామ‌న్నారు. వారికి మెరుగైన వైద్య చికిత్స అందిస్తామ‌న్నారు. శిథిలాల కింద ఇంకా ఎవ‌రైనా ఉన్నారా..? లేదా ..? తెలుసుకునేందు శిథిలాలను తొల‌గిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

Next Story
Share it